Brazil Woman Marry Indian| ప్రేమకు సరిహద్దులు లేవని చెబుతుంటారు. అది నిజమని నిరూపించింది ఓ బ్రెజిల్ మహిళ. 51 ఏళ్ల ముదురు వయసులో ఆమె ఒక భారతీయుడిని ప్రేమించింది. అయితే అప్పటికే ఆమెకు భర్త, పిల్లలున్నారు. వారందరినీ వదిలేసి ఆమె ప్రియుడితో కలిసి ఉండడానికి సముద్రాలు దాటి భారత దేశం వచ్చింది. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లోని భిండ్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ కు చెందిన 51 సంవత్సరాల రోజీ నాయిద్ షికేరా తన భర్త, 32 ఏళ్ల కొడుకుతో బ్రెజిల్ దేశంలో నివసిస్తోంది. సొంత ఇల్లు, కుటుంబంతో ఆమెకు ఆర్థికంగా ఒక స్థిరమైన జీవితం ఉంది. అయితే రోజీ గత రెండు సంవత్సరాలుగా ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. భర్త, కొడుకు ఇద్దరూ ఉద్యోగ రీత్యా ఎక్కువగా ఇంట్లో ఉండరు. దీంతో రోజీ 2023లో భారతదేశ పర్యటనకు వచ్చింది. గుజరాత్ లోని కచ్ లో ఆమె పర్యటన చేసే సమయంలో అక్కడ ఆమెకు పవన్ గోయల్ (30) అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి భాషలు వేరు, ఆమెకు సరిగా ఇంగ్లీషు కూడా రాదు.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
కుబ్ పర్యటనలో ఉన్నప్పుడు రోజీ సరిగా ఇంగ్లీషు రాక ఇబ్బంది పడుతుంటే పవన్ ఆమెకు సాయం చేసేవాడు. దీంతో ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఇద్దరి వయసులో 21 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇద్దరి మనసులు కలిశాయి. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ రోజీకి ఒక కుటుంబం ఉంది. తన భర్త, కొడుకుని కాదని పవన్ ని ప్రేమించినా.. ఆమె ముందడగు వేయలేదు. అందుకే రోజీ తన దేశం తిరిగివెళ్లిపోయింది.
ఆ తరువాత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేది. సోషల్ మీడియా ద్వారానే పవన్ తో సంప్రదించేది. కాలక్రమంలో ఆమె తన మనుసుని అదుపు చేయలేకపోయింది. ఈ విషయం తన కుటుంబానికి చెప్పింది. తాను ఇండియాకు వెళ్లి తన ప్రియుడితో ఉంటానని చెప్పింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. అయినా రోజీ తాను అనుకున్నట్లే చేసింది. చివరికి తన భర్త, కొడుకును వదిలి ఇండియాకు వచ్చేసింది.
పవన్ కూడా రోజీని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించాడు. రోజీ ప్రస్తుతం పవన్ కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ కు తన వివాహానికి అనుమతి ఇవ్వాలని కోరారు. వివాహం తరువాత కూడా రోజీ ఇండియాలోనే స్థిరపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రోజీ, పవన్ గోయల్ ప్రేమ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. స్వీడెన్ కు చెందిన క్రిస్‌టెన్ లీబర్ట్ అనే మహిళ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పవన్ కుమార్ అనే యువకుడికి పరిచయమైంది. ఇద్దరూ 10 ఏళ్ల పాటు ఆన్ లైన్ లోనే డేటింగ్ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె తనని పెళ్లి చేసుకోవడానికి భారత దేశం వచ్చేసింది. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు.