BigTV English

Rajamouli : మ‌రోసారి రాజ‌మౌళికి థాంక్స్ చెప్పిన మ‌ణిర‌త్నం

Rajamouli : మ‌రోసారి రాజ‌మౌళికి థాంక్స్ చెప్పిన మ‌ణిర‌త్నం
rajamouli

Rajamouli : ఇండియ‌న్ సినిమా డైరెక్ట‌ర్స్‌లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరున్న వ్య‌క్తి మ‌ణి ర‌త్నం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్2(PS2). ఈ మూవీ ఏప్రిల్ 28న ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల కాబోతుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం PS2 (పొన్నియిన్ సెల్వ‌న్2) నిర్మించారు. గ‌త ఏడాది విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మ‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు.


హైదరాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ‌ణి ర‌త్నం మాట్లాడుతూ మ‌రోసారి స్టార్ టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళికి ప్ర‌త్యేకంగా థాంక్స్ చెప్పారు. ఇలా జ‌క్క‌న్నకి మ‌ణిర‌త్నం థాంక్స్ చెప్ప‌టం రెండోసారి. పొన్నియిన్ సెల్వ‌న్ 1 రిలీజ్ స‌మ‌యంలోనూ మ‌ణిర‌త్నం మాట్లాడుతూ రాజ‌మౌళికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్పుడు మ‌రోసారి కూడా ద‌ర్శ‌క ధీరుడికి థాంక్స్ చెప్పారు. ఇంత‌కీ మ‌ణిర‌త్నం మ‌న డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి థాంక్స్ ఎందుకు చెప్పార‌నే వివ‌రాల్లోకి వెళితే, హైద‌రాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ‘‘పొన్నియిన్ సెల్వన్ గురించి చెప్పాలంటే ముందు నిర్మాత సుభాస్కర‌న్‌గారికే థాంక్స్ చెప్పాలి. ఆయ‌న వ‌ల్ల‌నే ఈ సినిమా చేయ‌టానికి సాధ్యమైంది. అయితే దీన్ని రెండు భాగాలుగా చేయ‌టానికి కార‌ణం రాజ‌మౌళి. అందుకు త‌న‌కు థాంక్స్‌. బాహుబ‌లి చిత్రాన్ని రెండు భాగాల్లో త‌ను తీయ‌క‌పోయుంటే నేను పొన్నియిన్ సెల్వ‌న్‌ను రెండు భాగాల్లో చిత్రీక‌రించ‌లేక‌పోయేవాడిని. ఈ విష‌యాన్ని రాజ‌మౌళికి కూడా చెప్పాను. త‌ను సినీ ఇండ‌స్ట్రీలో ఓ పెద్ద హిస్ట‌రీని క్రియేట్ చేశాడు. జ‌యం ర‌వి, కార్తి, విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య రాయ్‌, త్రిష‌, శోభిత‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, తోట త‌ర‌ణి, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, రెహ‌మాన్ స‌హా గొప్ప టీమ్‌తో ప‌ని చేశాను. వారంద‌రి స‌పోర్ట్ వ‌ల్ల‌నే ఈ సినిమాను గొప్ప‌గా చేయ‌గ‌లిగాను. క‌చ్చితంగా ఏప్రిల్ 28న థియేట‌ర్స్‌లో పీఎస్ 2ను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు


Related News

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Big Stories

×