Vinod Kambli latest news(Today’s sports news): టీమిండియా మాజీ ఆటగాడు వినోద్‌కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంబ్లీకి సహాయం చేయాలని క్రికెట్ అభిమానులు, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను కోరుతున్నారు.
సచిన్ టెండూల్కర్- వినోద్ కాంబ్లీ గురించి చెప్పనక్కర్లేదు. మంచి ఫ్రెండ్స్ మాత్రమే, క్రికెట్‌లో ఈ జోడి ప్రభంజనం అంతాఇంతా కాదు. ఇదంతా చిన్నప్పటి మాట. వినోద్‌కాంబ్లీ టీమిండియా తరపున ఆడినా, తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. కెరీర్ బాగుందన్న సమయంలో చిన్నచిన్న సమస్య లు వెంటాడుతున్నాయి.
మాజీ క్రికెటర్ వినోద్‌కాంబ్లీ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సమస్యలు, డిప్రెషన్ సహా రకరకాల సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యాడు కూడా. ఆ తర్వాత మెల్లగా కోలుకున్నాడు.
ALSO READ: శివమ్ దూబె, రాహుల్ పై వేటు? రేపే శ్రీలంకతో మూడో వన్డే
వినోద్‌కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడు.. ఎక్కడ అనేది పక్కనబెడితే.. ఏదో పని మీద బయటకు వచ్చాడు. ఓ షాపు ముందు ఉన్న బైక్ పట్టుకుని నిలబడ్డాడు. ఎదురుగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా నడవలేక ఇబ్బందిపడ్డాడు. కాంబ్లీని గమనించిన స్థానికులు.. అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాపులో కూర్చోబెట్టారు. ఈ తతంగం రాత్రి సమయంలో జరిగింది.
వినోద్‌కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా చితికిపోయాడు. బీసీసీఐ ఇచ్చే పింఛన్‌తో జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి చూసి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచిన్.. తన చిన్ననాటి మిత్రుడ్ని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
This is what Alcohol has done to a great player like #VinodKambli …
Stay Away from Alcohol Guys.
pic.twitter.com/OoTXwACe9k— Sukkumarkk (@StrictlyAsking) August 6, 2024