BigTV English

Samantha: శోభితా టెంపరరీ రా.. సమంత పర్మినెంట్.. అది ఆమె రేంజ్

Samantha: శోభితా టెంపరరీ రా.. సమంత పర్మినెంట్.. అది ఆమె రేంజ్

Samantha: సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఆమెను మించిన వారు ఎవరు లేరు. నిత్యం సోషల్ మీడియాలో ఆమె పేరు గురించి ప్రస్తావన లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, వివాదాలు, అవమానాలు.. ఇవేమి సామ్ కొత్త కాదు.  ఆమె ప్లేస్ లో ఇంకెవరు ఉన్నా కూడా ఇంత ధైర్యంగా నిలబడేవారు కాదేమో.. కానీ, సామ్ దైర్యంగా  నిలబడి ఐకానిక్ లేడీగా ఎంతోమందికి ఆదర్శంగా నిలబడింది. ఎన్నో అవరోధాలు, అడ్డంకులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి.. స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 ప్లేస్ లో నిలబడడం అంటే మాములు విషయం కాదు. వరుసగా సినిమాలు చేయకపోయినా..  వెండితెరపై కనిపించకపోయినా కూడా దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకొనేలా చేయడంలో ఈ బ్యూటీ ఎప్పుడు ముందే ఉంటుంది.


ఎప్పటికప్పుడు  ఐఎండీబీ ర్యాంకింగ్ లో సామ్ టాప్ 10 ప్లేస్ లలో  టాలీవుడ్ నుంచి మొదటి స్థానంలో ఉండేది. అయితే ఈసారి సామ్ వెనక్కి తగ్గిన విషయం తెల్సిందే. ఆమె స్థానాన్ని మరో అక్కినేని కోడలు శోభితా భర్తీ చేసింది. అక్కినేని నాగ చైతన్యతో శోభితా రెండో వివాహం ఈ నెలలోనే ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. చై తో శోభితా ఎంగేజ్ మెంట్ అని తెలిసాకా.. ఆమె గురించి తెలుసుకోవడానికి చాలామంది గూగుల్ సెర్చ్ చేసారు. అలా శోభితా ఈ ఏడాది టాప్ ప్లేస్ ను అందుకుంది.

Ram Gopal Varma : ఆర్జీవికి మరో షాక్… నోటీసులు పంపిన ఫైబర్ నెట్


అయితే.. ఆ పెళ్లి వరకే శోభితా గురించి ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు. అందుకే అక్కడవరకే శోభితా ఆగిపోయింది. కానీ, సామ్ మాత్రం మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా ఇంకా టాప్ ప్లేస్ లోనే నిలబడింది. అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీల లిస్ట్ ను ఓర్మాక్స్ అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో పోటీపడి  గత రెండు నెలలుగా సమంతనే టాప్ లో నిలబడింది.

మొదటి స్థానాన్ని సామ్ తీసుకోగా.. సెకండ్ ప్లేస్ లో అలియా భట్ నిలబడింది. ఇక మూడో స్థానంలో నయనతార, నాలుగో స్థానాన్ని సాయి పల్లవి అందుకుంది. ఇక ఇదో స్థానంలో దీపికా, ఆరో స్థానంలో త్రిష.. ఏడో స్థానంలో కాజల్ అగర్వాల్, ఎనిమిదివ  స్థానంలో రష్మిక ఉన్నారు. చివరి రెండు స్థానాలను శ్రద్ద కపూర్, కత్రినా కైఫ్ కైవసం చేసుకున్నారు.

Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?

ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో సమంతనే టాప్ ప్లేస్ లో ఉంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా సామ్.. నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. గత నెలలో మంత్రి కొండా సురేఖ .. సమంతపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి టాప్ ట్రెండింగ్ గా సామ్ నిలిచింది.

ఇక ఇది చూసిన ఫ్యాన్స్.. చై  పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. ? అని తెలుసుకోవడానికి మాత్రమే  శోభితా గురించి సెర్చ్ చేశారు. ఆమె కేవలం టెంపరరీనే.. కానీ సామ్ మాత్రం పర్మినెంట్.. అలా నిలబడింది. అది ఆమె రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×