Pushpa 2 Stampede Case : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొదట ఆ సినిమాకి తెలుగులో నెగెటివ్ టాక్ వచ్చినా కూడా నార్త్ లో మంచి ఆదరణ లభించడంతో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప సినిమాలోని చాలా వరకు డైలాగ్స్ ను సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ స్పోర్ట్స్ మెన్స్ విరివిగా వాడటం వలన ఆ సినిమా మరింత పాపులర్ అయింది. అయితే ఆ సినిమాకి సీక్వల్ గా పుష్ప టు సినిమాని తెరకెక్కించాడు సుకుమార్. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాకుండా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ రికార్డ్ హిట్ కూడా ఈ సినిమా సొంతం చేసుకునే దశలో ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయితే 4న చాలాచోట్ల ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ కుటుంబంతో పాటు ఈ సినిమా చూడ్డానికి వచ్చాడు.
థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో కేవలం సినిమాకు టికెట్ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాకుండా చాలామంది థియేటర్ కి ఎంట్రీ ఇచ్చేశారు. అక్కడ సిచువేషన్ను పోలీస్ సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఒకసారిగా తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలానే వాళ్ళబ్బాయి శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఘటన కారణంగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు కూడా పంపించారు. అల్లు అర్జున్ కి ఉన్న సర్కిల్ వలన కేవలం 24 గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మళ్ళీ బయటికి వచ్చేలా ప్లాన్ చేసి బెయిల్ ఇప్పించారు. అయితే అల్లు అర్జున్ బయటికి వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీస్ అల్లు అర్జున్ ని కలవడం మొదలుపెట్టారు.
ఒక తప్పు జరగటం వలన అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేసాడు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేడు అనేది వాస్తవం. ఆ కుటుంబానికి 25 లక్షలు ఇస్తాను అని అల్లు అర్జున్ అనౌన్స్ కూడా చేశారు. అయితే అదంతా ఓకే కానీ అల్లు అర్జున్ ని చాలామంది సెలబ్రిటీస్ కలిసిన వీడియోను లైవ్ టెలికాస్ట్ గా అందించారు మీడియా. అసలు అల్లు అర్జున్ కు ఆ ప్లాన్ ఎవరిచ్చారో కానీ అది ఒక బ్లెండర్ మిస్టేక్ అని చెప్పాలి. అల్లు అర్జున్ ను అక్రమంగా ఎవరు అరెస్టు చేయలేదు. తన వలన ఒక కుటుంబం నష్టపోయింది. పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ వినలేదు అని ఒక వెర్షన్ వినిపిస్తుంది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ప్రస్తుతానికి తెలియదు. అందువల్లనే అల్లు అర్జున్ అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత తనకేదో అన్యాయం జరిగినట్టు, ఒక సంతాప సభకు వచ్చినట్టు సెలబ్రిటీస్ అందరూ తనను పరామర్శించడం మొదలుపెట్టారు. అది కూడా తప్పుకాదు. కానీ ఆ విషయాన్ని పదిమందికి తెలిసేలా షో చేసి చూపించడం అనేది నేడు మరికొన్ని పరిణామాలకు దారితీస్తుంది.
Also Read : Akbaruddin Owaisi – Pushpa 2: తొక్కిసలాటలో మహిళ చచ్చిపోయిందా? అయితే నా సినిమా సూపర్ హిట్ అయినట్టే