BigTV English

Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?

Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?

Gukesh – Rashmika: భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సింగపూర్ వేదికగా డిసెంబర్ 12, 2024న జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో చైనా కి చెందిన డింగ్ లిరెన్ పై గెలుపొంది గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 18 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ఈ విజయంతో అతనికి అక్షరాల రూ.11 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. అయితే ఇంత మొత్తం ప్రైజ్ మనీ అతని చేతికి అందుతుందా..? అంటే లేదు.


Also Read: KL Rahul Injured: టీమిండియాకు బిగ్ షాక్… నాలుగో టెస్ట్ కు ఆ ప్లేయర్ దూరం !

ఈ రూ.11 కోట్లలో దాదాపు రూ. 4.67 కోట్ల రూపాయలు పన్ను రూపంలో ఆర్థిక శాఖ ఖజానాకు వెళుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో చెస్ లో గుకేశ్ గెలిస్తే.. ఆర్థిక చదరంగంలో భారత ప్రభుత్వం, మంత్రి నిర్మలా సీతారామన్ గెలిచారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వెలువడ్డాయి. దీంతో అతని ఆదాయపు పన్ను మాఫీ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ కూడా వెలువడుతున్నాయి. మరోవైపు తమిళనాడు ఎంపీ ఆర్. సుధ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు.


దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేశ్ కి ఆదాయపన్ను చెల్లింపులో మినహాయింపు కలిగించాలని కోరారు. “అతడు చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి వంటి వారికి పన్ను మినహాయింపు వెసులుబాటు కల్పించారు. ఆ తరహాలో గుకేశ్ కి కూడా పన్ను మినహాయించాలి. ఇలా చేయడం ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం” అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు తమిళనాడు ప్రభుత్వం అతడికి ఐదు కోట్లను ప్రోత్సాహకరంగా ఇచ్చిందని. కేంద్ర ప్రభుత్వం కూడా అతనికి ఐదు కోట్లతో పాటు జాతీయ అవార్డును ఇవ్వాలని కోరారు. జాతిని గర్వించేలా చేసిన వారికి పన్నుల నుంచి మినహాయింపు కలిగించాలని కోరారు. ఇక గుకేష్ ని మంగళవారం రోజున తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అంతేకాదు ఐదు కోట్ల నగదు పురస్కారాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అందజేశారు.

Also Read: Mohammed Siraj: సిరాజ్ అరుదైన రికార్డు.. పవర్ ప్లే లో అసలు సిసలు మొనగాడు!

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుకేశ్ తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి వెల్లడించాడు. తనకి వీలు కుదిరినప్పుడల్లా సినిమాలు చూస్తుంటానని పేర్కొన్నాడు. మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏంటి..? అని అడగగా.. చాలానే ఉన్నాయని తెలిపాడు. అందులో తెలుగులో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన గీతాగోవిందం సినిమా కూడా తన ఫేవరెట్ లిస్టులో ఉంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇంకా టీనేజ్ లో కూడా అడుగుపెట్టని వయసులోనే గుకేశ్ ని ఆకట్టుకుంది. అయితే గుకేశ్ కి కూడా నేషనల్ క్రష్ రష్మిక అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఈ సినిమా అంటే అతనికి ఇష్టమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×