విద్యుత్ వాహన రంగంలో చేతక్ స్కూటర్స్ తో తనకంటూ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ బజాజ్ ఆటో. ఈ సంస్థ తాజాగా మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్‌లో భాగంగా రెండు లేటెస్ట్ వెర్షన్స్ వచ్చాయి. ఇక ఇందులో 3501, 3502 పేరుతో లాంఛ్ అయ్యాయి. 3501 అనేది ప్రీమియం మోడల్ కాగా దీని ధర రూ.1.27 లక్షలు. ఇక 3502 ధర రూ.1.20 లక్షలుగా ఉంది. ఇక ఇదే సిరీస్‌లో త్వరలోనే 3503 మోడల్‌ను సైతం త్వరలో తీసుకురానున్నారు.
ఇక ఇప్పటికే లాంఛ్ అయ్యి ఆకట్టుకున్న పాత చేతక్ ఈవీ మోడల్స్ లోనే అదే క్లాసిక్ లుక్‌తో కొత్త మోడళ్లను బజాజ్ కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను ఉంది. ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో వెళుతుందని తెలిపింది. సింగిల్ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని వెల్లడించింది. బ్యాటరీని జీరో నుంచి ఫుల్ ఛార్జ్ చేయటానికి 3 గంటలు సమయం పడుతుందని తెలిపింది. 950 వాట్ల ఆన్ బోర్డ్ ఛార్జర్ తో వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్టీల్ మెటల్ మోనోకాక్ బాడీషెల్ సైతం ఉంది.
ఇందులో 5 అంగుళాల టచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే సైతం ఇచ్చారు. ఇక ఈ స్కూటర్స్ లో మ్యాప్స్ తో పాటు కాల్ ఆన్సర్, కాల్ రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి బెస్ట్ సదుపాయాలు కూడా ఉన్నాయి. వీటితో ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. జియో ఫెన్స్, థెఫ్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్‌స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్ వంటి భద్రతాపరమైన ఫీచర్లను కూడా బజాజ్ జోడించింది. రీపోజిటెడ్ బ్యాటరీ ప్యాక్ 35 లీటర్ల పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ ను కలిగి ఉంది.
బజాజ్ ఆటో తన తొలి చేతక్‌ను 2020లో లాంఛ్ చేసింది. ప్రస్తుతం 3201, 3202, 2903, 3201 స్పెషల్ ఎడిషన్ పేరిట నాలుగు వెర్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈవీ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నెమ్మదిగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తున్న ఈ కంపెనీ.. ఇప్పటివరకు 3 లక్షల చేతక్ ఈవీలను విక్రయించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బజాజ్ వాటా 12 శాతంగా ఉన్న మార్కెట్ వాటా.. డిసెంబర్ నాటికి 27 శాతానికి పెంచుకుంది. మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చిన కొత్త స్కూటర్ ద్వారా టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఏథర్ రిజ్తా మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ALSO READ : 7mm థిక్నెస్, 200MP కెమెరా.. సామ్సాంగా స్లిమ్ లెవెలే వేరు