BigTV English

Oscar: ఓటీటీలో 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే

Oscar: ఓటీటీలో 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే


96th Oscar Academy Awards: ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 10న జరగనుంది.

ఈ సంవత్సరం అకాడమీ అవార్డులను హాస్యనటుడు, టాక్ షో హోస్ట్ జిమ్మీ కిమ్మె హోస్ట్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేయడం ఆయనకి ఇది నాలుగోసారి. కాగా ఆస్కార్ అవార్డ్స్ గాలా నైట్ వేర్వేరు టైమ్ జోన్‌ల ప్రకారం వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.


అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్‌ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. ఈ ఈవెంట్ ఆదివారం USAలో జరగాల్సి ఉండగా.. టైం వ్యత్యాసాన్ని బట్టి సోమవారం భారతదేశంలో తెల్లవారుజామున ప్రసారం చేయబడుతుంది.

READ MORE: ఆస్కార్‌ అవార్డ్స్ వేడుక.. పోటీపడుతున్న సినిమాలివే!

భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం 4 గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్రకటించింది.

అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో ఓ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ ఏడాది ఈ ఆస్కార్ అవార్డులకు ఓపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో, బార్బీ, అమెరికన్ ఫిక్షన్, పూర్ థింగ్స్ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి.

అయితే ఇండియా నుంచి ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ పోటీలో నిలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ఈ చిత్రం నామినేట్ అయింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

READ MORE: ఆస్కార్ వేడుకకు రంగం సిద్ధం..

ఇకపోతే గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్‌ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×