BigTV English
Advertisement

Allu Arjun : శత్రు దేశం పాకిస్తాన్ జైల్ అయినా.. పుష్పాకి ఫ్యాన్ అవ్వాల్సిందే..

Allu Arjun : శత్రు దేశం పాకిస్తాన్ జైల్ అయినా.. పుష్పాకి ఫ్యాన్ అవ్వాల్సిందే..

Allu Arjun : పుష్పా సినిమాతో అల్లు అర్జున్ పాలపులారిటీ మామూలుగా పెరగలేదు. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్. తన నటనతో అందర్నీ తెలుగు ఫిలిమ్స్ చూసేలా చేశాడు. అయితే అల్లు అర్జున్ కి పుష్పా సినిమాకి ముందే దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం అందరికీ తెలిందే. అల్లు అర్జున్ ను కేరళలో ప్రేమగా మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు.


ఉట్టి కేరళనే కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ని అక్కడి ప్రజలు ఓన్ చేసుకుని వారికి నచ్చిన పేరుతో పిలుస్తారు.. మన దేశం కాబట్టి మనోడికి మంచి గుర్తింపు వచ్చిందనుకుంటే పప్పులో కాదు పుష్పా సినిమాలో కాలేసినట్టే.. అవును మరి బన్నీకి నేషన్ వైడ్ గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన శత్రు దేశం అయిన పాకిస్తాన్ లోనూ మనోడి హవా ఉందంటే నమ్ముతారా.. అవునా నిజమా అని అనుకుంటున్నారు కదా అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే..

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ఓ రియల్ కథ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ రియల్ స్టోరీ వాళ్ళే రామారావు, నూకమ్మను ఈటీవీలోని ఓ షోకి పిలిచి తమ జీవితం గురించి అడిగారు. అందులో భాగంగానే పాకిస్తాన్ జైలు ప్రస్తావన వచ్చింది. అసలు పాకిస్థాన్ జైల్లో ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా చెప్పాడు.


“ఉదయం 9 అయ్యిందంటే చాలు జైలు గేట్ తాళాలు తీస్తారు. అక్కడ పాకిస్తాన్ ఖైదీలు చాలా భయంకరంగా ఉంటారు. మేము ఇండియన్స్ అని తెలిసాక వాళ్ళు మమ్మలి బాగా ఎగతాళి చేసే వాళ్ళు. అక్కడ కూడా తెలుగు సినిమాలు చూస్తారని చెప్పగా.. అక్కడ అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారని ఓ వార్త వచ్చిందని దీనిపై మీరేమంటారని యాంకర్ రష్మీ అడిగింది.

“అవును నిజమే తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అవుతాయి. జైల్లో ఓ కానిస్టేబుల్ అల్లు అర్జున్ మూవీస్ ని ఎక్కువగా హిందీలో చూస్తూ ఉంటాడట. అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కూడా కావాలని అడిగాడు. ఆటోగ్రాఫ్ మాకే దొరకదు ..ఇంకా నీకు ఎలా దొరుకుతుంది అని మేము నవ్వుకున్నాం. కానీ పాకిస్తాన్ లో కూడా తెలుగు వాళ్లకు ఫాన్స్ ఉండడం నిజంగా గర్వకారణం” అని చెప్పాడు.

14 నెలలు పాకిస్తాన్ జైల్లో ఉండి విడుదల అయ్యామని రామారావు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సినిమాలో చెప్పినట్టుగా పుష్పా అంటే ఇంటర్నేషనలే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×