Adah Sharma : ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లంతా పెళ్లి, పిల్లలు అంటూ పర్సనల్ లైఫ్ లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా ఒకరు. ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పైగా పెళ్లి గురించి తాజాగా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
పెళ్లి పీడకల అంటూ అదా షాకింగ్ కామెంట్స్
అదా శర్మ 2008లో రిలీజ్ అయిన హర్రర్ మూవీ ‘1920’ ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ప్రైవేట్ గానే ఉంచుతుంది. ఇప్పటిదాకా ఆమె రిలేషన్ షిప్స్ గురించి లేదా బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాకపోవడమే అందుకు ఉదాహరణ. అయితే తాజా ఇంటర్వ్యూలో అదా శర్మ పెళ్లి గురించి స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి బట్టల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అదా శర్మ మాట్లాడుతూ “పెళ్లి చేసుకోకపోవడం అనేది నా డ్రీమ్. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే అదే ఒక పీడకలు అవుతుంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
“రిలేషన్ షిప్ లో ఉండడానికి భయపడుతున్నారా?” అనే ప్రశ్నకి అదా శర్మ స్పందిస్తూ “నేను ఏ రిలేషన్ కి భయపడను. నాకు తెలీదు గానీ పెళ్లి గురించి నేను తెరపై చాలా విషయాలు చూశాను. కానీ నిజ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. ఎవరినైనా నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తే దానిని సౌకర్యవంతమైన దుస్తులలో చేసుకోవడానికి ఇష్టపడతాను. లేదా అసౌకర్యమైన దుస్తులలో పెళ్లి చేసుకోవాల్సి వస్తే అది మరింత సరదాగా ఉంటుంది. కానీ అప్పుడు నేను ఏదో ఒక థీమ్ తరహ పనులు చేయడానికి ఇష్టపడే వ్యక్తిని చేసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ది టాప్ లేదా క్యారియేచర్ – ఇష్ థీమ్ వెడ్డింగ్ లాగా. అప్పుడే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు” అని పెళ్లి ప్రస్తావనకు ఫుల్ స్టాప్ పెట్టింది.
‘ది కేరళ చిత్రం’తో సరికొత్త రికార్డు
2023లో అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ మూవీ భారత దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా చరిత్రను సృష్టించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రూ. 240 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ మూవీ బాలీవుడ్ లో ‘గంగూబాయి కథియావాడి’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి సినిమాల కలెక్షన్లను అధిగమించడం విశేషం. ప్రస్తుతం అదా శర్మ ‘తుమ్ కో మేరీ కసం’ (Tumko Meri Kasam) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ్ ఖేర్, ఈశా డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 21 న రిలీజ్ కానుంది.