BigTV English

Star Hero : పని పక్కన పెట్టి… ఫారెన్ టూర్స్… ఇదెక్కడి టార్చర్ అంటున్న డైరెక్టర్స్

Star Hero : పని పక్కన పెట్టి… ఫారెన్ టూర్స్… ఇదెక్కడి టార్చర్ అంటున్న డైరెక్టర్స్

Star Hero : ఇటీవల కాలంలో కొంతమంది స్టార్ల తీరు డైరెక్టర్స్ కి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని సినిమాకు కమిట్ అయితే, వాళ్లు మాత్రం ఆ సినిమాల్ని పక్కన పెట్టి, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవ్వకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇలాగే పాన్ ఇండియా ఫేమ్ ఉన్న ఓ హీరో… చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ, వాటి షూటింగ్ విషయం పట్టించుకోకుండా విదేశాల్లో వెకేషన్లు అంటూ చక్కర్లు కొడుతున్నాడు. దీంతో ఇదెక్కడి తలకాయ నొప్పిరా సామీ అని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.


సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న హీరో
మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ఓ బిగ్ స్టార్ ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటలీలోని ఓ విలేజ్లో అతను సేద తీరుతున్నట్టు సమాచారం. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినట్టే ఈ హీరో కూడా సమ్మర్ హాలిడేస్ తీసుకోవడం ఏంటో తెలియక నిర్మాతలు సతమతమవుతున్నారు. ఎందుకంటే సదరు హీరో వేసవి సెలవులు ముగిసే వరకు మళ్లీ సెట్ మీదకు రాకపోవచ్చు అని టాక్ నడుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆయనను నమ్ముకుని ముగ్గురు నలుగురు దర్శకులు సినిమాలకు కమిట్ అయ్యారు. కానీ ఈ హీరో మాత్రం ఏ మాత్రం టెన్షన్ లేకుండా హ్యాపీగా సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోయారు.

ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న రెండు సినిమాల షూటింగ్స్ మొదలై, పెండింగ్ లోనే ఉన్నాయి. ఓ సినిమాలో కొన్ని పాటలు, మరికొంత షూటింగ్ పెండింగ్లో ఉండగా… మరో సినిమాకు సంబంధించి పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇక ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఓ పాన్ ఇండియా సినిమా టీజర్ అయితే ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. చాలాకాలంగా హీరో షూటింగ్లకి రాకుండా పెడుతున్న ఇబ్బందుల వల్ల ఈ సినిమాలన్నీ పెండింగ్లో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది.


ఎన్ని సమ్మర్లు వచ్చి పోవాలో !
చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నప్పటికీ హీరో బిహేవియర్ కారణంగా ఈ ఏడాది ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా దసరాకు లేదంటే వచ్చే సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆ హీరో అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మరో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి కూడా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. నిజానికి ఈ హీరో కరెక్ట్ గా షూటింగ్ కి వెళ్లి ఉంటే ఇప్పటికే ఓ పాన్ ఇండియా డైరెక్టర్ తో చేయాల్సిన మోస్ట్ వైలెన్స్ సినిమా సెట్ మీదకి వెళ్లాల్సి ఉంది. కానీ ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు. ఇక మధ్యలో మరో సినిమా సంగతి తేలాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయితే మరో బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద సదరు హీరో ఫోకస్ పెట్టాలి. అప్పట్లోగా ఎన్ని సమ్మర్లు వస్తాయి? ఈ హీరో ఎన్ని వెకేషన్లకి వెళ్తారో? నిర్మాతలకు ఎన్ని కోట్ల నష్టం వాటిల్లుతుందో? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ఈ హీరోతో ఎందుకు సినిమా చేస్తున్నాంరా దేవుడా అని దర్శకనిర్మాతలు వాపోతున్నట్టు తెలుస్తోంది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×