BigTV English

Parvati Nair: పనిమనిషి కంప్లైంట్.. హీరోయిన్ పై కేస్ ఫైల్.. అసలేమైందంటే..?

Parvati Nair: పనిమనిషి కంప్లైంట్.. హీరోయిన్ పై కేస్ ఫైల్.. అసలేమైందంటే..?

Parvati Nair.. ప్రముఖ మలయాళ హీరోయిన్ పార్వతి నాయర్ (Parvati Nair) పై తాజాగా కేసు నమోదవడం, అది కూడా ఒక పనిమనిషి చేసిన ఫిర్యాదు వల్ల ఆమెపై కేసు నమోదవడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతోంది. అసలు ఏం జరిగింది అంటూ అభిమానులు సైతం ఆరా తీయడం మొదలుపెట్టారు. దొంగతనం నెపంతో తనపై దాడి చేసిందని, తన పనిమనిషి సుభాష్ చంద్రబోస్ తాజాగా పవిత్ర నాయర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెతోపాటు మరో నలుగురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.


అసలు ఏం జరిగింది..?

అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కేజేఆర్ స్టూడియోలో హెల్పర్ గా పని చేసేవాడు. అయితే 2022 లో పనిమనిషి గా చేరాడు. అయితే అదే ఏడాది అక్టోబర్ లో చెన్నైలో ఉన్న పార్వతి ఇంట్లో దొంగతనం జరిగింది. పార్వతి నాయర్ ఇంట్లో రూ .2లక్షల విలువైన ల్యాప్ టాప్, రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు దొంగతనం చేయబడ్డాయి. తన పనిమనిషి సుభాష్ ఈ దొంగతనం చేశాడని పార్వతి ఆరోపిస్తూ.. కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడిని విడుదల చేశారు పోలీసులు.


పార్వతీ నాయర్ పై పని మనిషి ఫిర్యాదు..

Parvati Nair: Maid complaint.. Case file on heroine.. What is wrong..?
Parvati Nair: Maid complaint.. Case file on heroine.. What is wrong..?

అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ తిరిగి కేజేఆర్ స్టూడియోలో పనిలో చేరాడు. ఆ స్టూడియోలో ఉన్న పార్వతి తనను కొట్టిందని ఆరోపించారు. ఆమెతోపాటు మరో నలుగురు వ్యక్తులు తనను తీవ్రంగా దుర్భాషలాడారు అంటూ చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట 19 ఎం ఎం కోర్టును ఆశ్రయించారు సుభాష్. విచారణ చేపట్టిన తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పార్వతీతోపాటు మరో నలుగురి వ్యక్తుల పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మొత్తానికైతే ఇవి ఆరోపణల లేక నిజంగానే ఆమె కొట్టిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

పార్వతీ నాయర్ కెరియర్..

పార్వతీ నాయర్ విషయానికి వస్తే.. మలయాళ కుటుంబానికి చెందిన ఈమె సొంత భాషలోనే కాకుండా తమిళ్ , కన్నడ భాషల్లో కూడా నటిస్తూ పేరు సొంతం చేసుకుంది. స్టోరీ కాతే, డి కంపెనీ, పాప్పిన్స్, యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్, ఉత్తమ విలన్, వాస్కోడిగామా, 83, ధూమం, గోట్ ఇలా పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఇకపోతే కన్నడ, తమిళ్ చిత్రాలలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడిపై ఇప్పుడు కేస్ ఫైల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంగతి ఏంటో తెలుసుకొని ఆ తర్వాత కేస్ ఫైల్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పనిమనిషి కారణంగా ఇప్పుడు పార్వతీ నాయర్ చిక్కుల్లో ఇరుక్కుందని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×