Vi Recharge: వోడాఫోన్ ఐడియా (Vi) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ ప్రత్యేకమైన రీఛార్జ్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.35లకే 1GB డేటాతో పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను అందించే కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ను పరిచయం చేసింది. హిందీయేతర ప్రాంతీయ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు చూడాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాక్‌ను తీసుకొచ్చినట్లు వీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కొత్త యాడ్ ఆన్ ప్యాక్ కు సంబంధించిన వివరాలేంటో చూద్దాం.
ఈ రూ. 35 ప్యాక్ ద్వారా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, హర్యాన్వీ, భోజ్‌పురీ వంటి 9 భారతీయ భాషలలో వినోదాన్ని పొందే అవకాశాన్ని వీఐ కల్పించింది. ఈ ప్యాక్ కింద మెుత్తం 6 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను ఆప్షనల్ గా వీఐ అందిస్తోంది. అందులో రెండింటిని మాత్రమే యూజర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. సోనీలివ్ సౌత్, చౌపాల్ (Chaupal), మనోరమా మ్యాక్స్, క్లిక్, అడ్డాటైమ్స్, ఆవో నెక్స్ట్ (Aao NXT) ఓటీటీల్లో మీకు నచ్చిన రెండు ఎంచుకోవచ్చని వీఐ తెలిపింది.
ఈ రూ. 35 ప్యాక్‌లో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 1GB డేటా కూడా వీఐ అందిస్తోంది. అయితే 1GB డేటా వాలిడిటీ 7 రోజులు మాత్రమేనని వీఐ తెలిపింది. మరోవైపు ఎంచుకున్న రెండు OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ వాలిడిటీ 28 రోజులుగా వీఐ నిర్ణయించింది. అయితే ఈ స్ట్రీమింగ్ బెనిఫిట్ కేవలం మొబైల్ ఫోన్లలో చూడటానికి మాత్రమే వర్తించనుంది.
ఈ రూ.35 ప్యాక్ కావాల్సిన వారు వీఐ యాప్, వెబ్ సైట్, ఇతర థర్డ్ పార్టీ ద్వారా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును వీఐ కల్పించింది. రీఛార్జ్ పూర్తయిన తర్వాత ‘వీఐ మూవీస్ అండ్ టీవీ’ యాప్‌ను ఓపెన్ చేసి వీఐ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ అవ్వాలి. యాప్‌లో కనిపిస్తున్న ఆరు ప్లాట్‌ఫామ్‌లలో మీకు కావలసిన రెండు OTT సేవలను ఎంచుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు.