BigTV English
Advertisement

PKSDT : పవన్ కళ్యాణ్ జోరు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు

PKSDT : పవన్ కళ్యాణ్ జోరు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు
PKSDT

PKSDT : పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోరు మీదున్నారు. ఒక వైపు రాజ‌కీయాలు.. మ‌రో వైపు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారాయ‌న‌. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉండ‌టంతో ఆలోపు త‌ను క‌మిట్ అయిన సినిమాల‌ను పూరి చేయ‌టంపై ఫోక‌స్ చేశారు. ఇప్ప‌టికే హ‌రి హ‌ర వీర మ‌ల్లు మూవీ సెట్స్‌పై ఉంది. ఇది కాకుండా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, సుజిత్ మూవీ ఓటీ కూడా సెట్స్‌పై వెళ్ల‌టానికి రెడీ అయ్యాయి. అయితే ఇవేవీ కాకుండా వీట‌న్నింటికంటే ఆల‌స్యంగా స్టార్ట్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ చిత్రం ముందుగా రిలీజ్‌కు రెడీ అయిపోయింది.


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ సినిమాలో న‌టిస్తున్నారు. స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌కుడు. త‌మిళ చిత్రం వినోద‌య సిత్తంకు ఇది రీమేక్‌. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్ర‌మ్ క‌థ‌ను పూర్తిగా మార్చేశారు. దీని కోసం ప‌వ‌ర్‌స్టార్ కేవ‌లం ఇర‌వై రోజుల స‌మ‌యాన్ని మాత్ర‌మే ఇచ్చారు. దీంతో స‌ముద్ర ఖ‌ని అండ్ టీమ్ ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న స‌న్నివేశాల‌ను ముందుగానే చిత్రీక‌రిస్తూ వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిదే.

తాజాగా PKSDT మూవీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. జూలై 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. నిజంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఇది ఖుషినిచ్చే విష‌య‌మ‌నే చెప్పాలి. ఈ సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత ప‌వ‌న్ హ‌రీష్ శంక‌ర్‌, సుజిత్ చిత్రాల‌తో పాటు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుపై కూడా ఫోక‌స్ పెడుతారు. మ‌రో వైపు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు త్రివిక్ర‌మ్‌. మ‌రి ఆ సినిమా ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో చూడాలి మ‌రి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×