Pawan Kalyan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు రాజకీయాల్లోకి రావాలనుకున్న పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే తన అన్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)స్థాపించిన ‘ప్రజారాజ్యం పార్టీ’ కోసం ఎంతగానో శ్రమించారు. అయితే 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అయితే తానే సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలనుకున్నారు. అందులో భాగంగానే ‘జనసేన పార్టీని’ స్థాపించి పోటీ చేసినా డిపాజిట్లు లేకుండా గల్లంతయ్యారు. అయితే ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ తో పొత్తు పెట్టుకున్నారు. ఇక పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ కి ఊహించని గౌరవం లభించింది. అలా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు.
అల్లు అర్జున్ ని కలవనున్న పవన్ కళ్యాణ్..
ఇదిలా ఉండగా మరొకవైపు అల్లు అర్జున్ అరెస్టయి చెంచలగూడ జైల్లో ఒకరోజు గడిపి ఇటీవలే నిన్న అనగా డిసెంబర్ 14న బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈయనను పరామర్శించడానికి టాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, నిర్మాతలు క్యూ కట్టారు. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, సురేఖ కూడా వచ్చి పరామర్శించారు. ముఖ్యంగా తమ మధ్య బంధుత్వం తప్ప విభేదాలు లేవని నిరూపించారు. అయితే ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ను కలవడానికి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలవకుండానే విజయవాడకు వెళ్ళిపోయినట్లు సమాచారం.
బన్నీని కలవకుండానే విజయవాడ వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిన్న రాత్రి హైదరాబాద్ కి వచ్చిన పవన్ కళ్యాణ్, ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ని కలుస్తారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం విజయవాడకు తిరిగి వెళ్లిపోయారు. మరి కాసేపట్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళి అర్పించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ విషయం ఒకరకంగా విమర్శలకు దారితీస్తోంది అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కావాలనే అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్లలేదు అంటూ బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగింది..?
అసలు విషయంలోకి వెళ్తే.. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే సమయంలో కేవలం సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మద్దతు పలికారు. అయితే వైసిపి అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవి కోసం నేరుగా ప్రచారం నిర్వహించారు. దీంతో మెగా, పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీనికి తోడు అడుగడుగునా మెగా అభిమానులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు.అటు నాగబాబు కూడా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలవలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అభిమానులు అనుకున్నట్టు అసలు నిజం ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ని కలవకుండానే వెళ్ళిపోయారు.