BigTV English

Kakinada Port PDS Rice : కాకినాడ పోర్టుకు పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. ఎందుకంటే..

Kakinada Port PDS Rice : కాకినాడ పోర్టుకు పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. ఎందుకంటే..

Kakinada Port PDS Rice : కాకినాడ పోర్ట్ లో మరోమారు రేషన్ బియ్యం కలకలం రేగింది. ఇప్పటికే ఈ పోర్టు నుంచి కోట్లాది రూపాయల విలువైన రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా అయిందని కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ అక్రమ రవాణాకు పాల్పడే నేతలు, అధికార యంత్రాంగం సహా ఇతరులపై కూటమి నేతలు గట్టిగా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు, ఏకంగా షిప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఇంకా మరువక ముందే మరోమారు రేషన్ బియ్యం ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయన్న వార్తలు కాకినాడ పోర్ట్ లో హాట్ టాపిక్ గా మారాయి.


కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేందుకు 142 కంటైనర్ లలో బియ్యం పోర్ట్ కి వచ్చాయన్న విషయం తెలిసిన వెంటనే అధికారులకు అప్రమత్తమయ్యారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి యంత్రాంగం హుటాహుటిన పోర్టుకు చేరుకుంది. పోర్టుకు వచ్చిన బియ్యం.. రా రైస్ లేదా రేషన్ బియ్యమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. కాకినాడ సీ- పోర్టుపై రాష్ట్ర స్థాయిలో నిఘా పెరగడంతో.. జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బియ్యం ఎగుమతి సంగతి తెలిసిన వెంటనే ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర ఉన్నతాధికారులు కంటైనర్ల వద్దకు చేరుకున్నారు. పోర్ట్ అధికారుల అనుమతితో కంటైనర్లను తెరిచి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయన్న సమాచారాన్ని సేకరించారు. కంటైనర్ లో ఉన్న బియ్యంలో రేషన్ బియ్యం ఉండే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎంత మేర రేషన్ బియ్యం ఉన్నాయి? అన్న విషయాలను పరిశీలిస్తున్నారు.

అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్లు అన్నింటినీ పరిశీలిస్తున్న అధికారులు.. వాటిలోని బియ్యం నమూనాల సేకరించి ప్రభుత్వ ప్రయోగశాలలకు పంపిస్తున్నారు. ప్రస్తుత పరిశీలనలో రేషన్ బియ్యం  ఉంటే కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ పోర్టు నుంచి వేలాది కోట్ల రూపాయల అక్రమ బియ్యం ఎగుమతులు సాగాయన్న ఆరోపణ నేపథ్యంలో.. పోర్ట్ అధికారులు, జిల్లా యంత్రాంగం రేషన్ బియ్యం కట్టడికి గట్టి దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి.


ఇటీవల స్టెల్లా నౌకలో రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్లి స్టెల్లా నౌకను, అందులోని రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే నౌకను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులపై ఎలాంటి ఒత్తిడి వచ్చిన తాను చూసుకుంటానంటూ హామి ఇచ్చారు. అవసరం అయితే.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానంటూ చెప్పారు. ఆ పర్యటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో రేషన్ బియ్యం ఎగుమతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం అయిపోయింది.

Also Read : జగన్‌కు బిగ్ షాక్‌.. కడప కార్పొరేషన్‌లో 15 కార్పొరేటర్లు జంప్!

ఇటీవల రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్రమాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ కోట్లకు పడగలెత్తిన వైసీపీ నేతలను ఒక్కొక్కరిగా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరును బహిరంగంగానే అనేకమార్లు ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరికొందరు నేతలే టార్గెట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు. వారి అక్రమాలను బయట పెట్టి, కటకటాల్లోకి నెట్టేందుకు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే.. మచిలీపట్నంలోని సొంత గోదాములో నిలువ చేసిన ప్రభుత్వం రేషన్ బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ.. పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో పేర్ని నాని సహా మొత్తం కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు మచిలీపట్నంలో వినిపిస్తున్నాయి.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×