Big Stories

Pawan Kalyan: అభిమాని ఇచ్చిన పెన్నుతో పవన్ సంతకం.. ఎంత ప్రేమయ్య నీకు

Pawan Kalyan news today(Tollywood celebrity news): ఇకనుంచి పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ కాదు.. డిప్యూటీ సీఎం అని ఉంటుంది. ఈరోజే ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించి.. ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అని స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవిని అందుకున్నారు.

- Advertisement -

ఇక ఈ విజయంలో పవన్ కు అండగా ఉన్నవారు అభిమానులు. ఆ అభిమానాన్ని పవన్ ఎప్పుడు మర్చిపోవడం లేదు. తాజాగా నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ తొలి ఫైల్ పై సంతకం అభిమాని ఇచ్చిన పెన్నుతోనే పెట్టడం గమనార్హం. ఎన్నికల్లో గెలిచిన అనంతరం పవన్ వెళ్తుండగా ఒక అభిమాని.. ఆయనకు ఒక పెన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని విలువ రూ. 10 మాత్రమే. అయినా అభిమాని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ గా పవన్ దాన్ని జేబులో పెట్టుకున్నారు.

- Advertisement -

ఇక అదే రోజు పవన్ కళ్యాణ్.. మెగా ఇంటికి వెళ్లగా వదిన సురేఖ ఆయనకు ఒక ఖరీదైన పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. తల్లి సమానురాలైన వదినమ్మ అంత ప్రేమగా ఇస్తే పవన్ స్వీకరించకుండ ఉంటారా.. ? ఎంతో ప్రేమగా ఆ పెన్నును కూడా జేబులో పెట్టుకున్నారు. నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్.. రెండు ఫైల్స్ పై సంతకం చేశారు.

ఒక ఫైల్ మీద అభిమాని ఇచ్చిన పెన్నుతో సంతకం చేయగా.. ఇంకో ఫైల్ మీద వదినమ్మ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు. ఈ విధంగా అభిమానులు, కుటుంబం రెండు ఒక్కటే అని నిరూపించారు. దీంతో ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఎంత ప్రేమయ్య నీకు అభిమానులు అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News