HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ ఒక్కసారిగా రాజకీయాల(Politics) వైపు అడుగులు వేశారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపిస్తూనే, మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ వచ్చారు.. ఇకపోతే 2029 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పలు సినిమాలకు కమిట్ అయ్యారు. ఆ సినిమాల షూటింగ్ పూర్తి కాకుండానే ఎన్నికలు జరగడం పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది.
పవన్ కళ్యాణ్ ఈ విధంగా రాజకీయాలలో బిజీ కావడంతో సినిమాలలో నటించే సమయం దొరకలేదు. ఈ క్రమంలోనే ఈయన కమిట్ అయిన సినిమా షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ కు సమయం దొరికినప్పుడు ఒక్కొక్క సినిమాని పూర్తి చేస్తూ వచ్చారు.. ఈ క్రమంలోనే పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 12వ తేదీ భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
డిప్యూటీ సీఎం హోదాలో…
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదల కాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ కూడా మొదలయ్యాయి. అమెరికాలో ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ కు భారీ స్థాయిలో స్పందన లభిస్తుంది. అక్కడ హాట్ కేకులా టికెట్లు అమ్ముడుపోతున్నాయని చెప్పాలి.
ట్రైలర్ రిలీజ్ కు ముందే రికార్డులు…
ఇప్పటివరకు పలువుర హీరోల సినిమాలకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ అయినప్పటికీ ఆ హీరోల రికార్డులన్నీ చెరిపేస్తూ హరిహర వీరమల్లు సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కాకుండానే అమెరికాలో ఈ సినిమాకు ఏకంగా $67,559 అడ్వాన్స్ టికెట్లు బుక్ అయ్యాయి. ఇకపోతే గతంలో విడుదలైన హీరోల సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ విడుదలకు ముందు $47,544 టికెట్లు బుక్ అయ్యాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్,$60,796 , ఎన్టీఆర్ దేవర – $137,309 అల్లు అర్జున్ పుష్ప 2- $287,939, ప్రభాస్ సలార్ – $108,925 అడ్వాన్స్ టికెట్లు బుక్ అయ్యాయి.
Before trailer release #HariHaraVeeraMallu USA Premiere Advance Sales🇺🇸:$67,559
At the same time:#GunturKaaram – $47,544 #GameChanger – $60,796 #Devara – $137,309 #Pushpa2 – $287,939#Salaar – $108,925 pic.twitter.com/YHiyNzB6lF
— Akira Nandan Fans club™ (@Akira_Nandan_Fc) May 26, 2025
ఇకపోతే పుష్ప2, దేవర, సలార్ సినిమాలతో పోలిస్తే హర హర వీరుమల్లు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ అయ్యే సమయానికి పవన్ సినిమా ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఇలా ట్రైలర్ విడుదల కాకుండానే ఈ సినిమాకు ఈ స్థాయిలో బజ్ ఏర్పడింది అంటే ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాబడుతుందని స్పష్టమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతున్న ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.