Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయనకు ఉన్న క్రేజ్ అతీతం అని చెప్పాలి. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఒక హిట్ సినిమా కూడా ఈయన కెరియర్ లో పడలేదు. కెరియర్ లో హిట్స్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఏమాత్రం తగ్గలేదు మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. దీని కారణం పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ మాత్రమే కాకుండా రియల్ లైఫ్ కూడా అని చెప్పాలి. హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణి ఎలా ఉండాలని కోరుకుంటాడు ఈ సినిమాలో అలా చూపించాడు హరీష్. ఇది ఒక రీమేక్ సినిమా అయినా కూడా ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలబడింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.
ఇక ఈ సినిమా తర్వాత చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే సినిమాను చేశాడు పవన్ కళ్యాణ్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేస్తాడు అని అందరూ అనుకున్న తరుణంలో మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వలన వకీల్ సాబ్ అనే సినిమాతో రీయంట్రి ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి ఫలితాలను చూసే కానీ సరైన కలెక్షన్స్ రాలేదు దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేయనున్నట్లు అనౌన్స్మెంట్లు చేశారు. వీటిలో చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తున్నా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి కేవలం కొన్ని రోజులు మాత్రమే టైం కేటాయించిన కూడా అద్భుతమైన కంటెంట్ తీసుకొచ్చాడు హరీష్. సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రెండు టీజర్ రిలీజ్ చేశాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కూడా డేట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ సిటింగ్స్ హైదరాబాద్ పార్క్ హాయైత్ హోటల్ లో జరుగుతున్నాయి. హరిష్ శంకర్ ఈ సినిమా గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమాకు మించి ఉంటుందని హరీష్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిలా మిగిలిపోవాలి అనే విధంగా ప్లాన్ చేస్తున్నాడు హరీష్.