BigTV English

Game Changer: రెండు రాష్ట్రాలలో నాలుగు సినిమాలకి ఒకరే డిస్ట్రిబ్యూటర్

Game Changer: రెండు రాష్ట్రాలలో నాలుగు సినిమాలకి ఒకరే డిస్ట్రిబ్యూటర్

Game Changer: మామూలుగా సినిమాలో రిలీజ్ అవ్వడం కంటే కూడా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు సీజన్లో కంటే కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలకి కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తాయి. యావరేజ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. అలాంటిది ఒక సూపర్ హిట్ సినిమా సంక్రాంతి సీజన్ లో పడితే కలెక్షన్ బీభత్సంగా వస్తాయి అని చెప్పొచ్చు. ప్రతిసారి సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈసారి కూడా చాలా పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.


శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. ఎస్ఎస్ థమన్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటల కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాస్తవానికి గేమ్ చేంజెర్ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే దిల్ రాజు ప్రకటించారు. కానీ ఇంకా కొంతమేరకు వర్క్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమాను సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. కేవలం ఈ సినిమా కోసమే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారు.ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలానే బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న (Nbk109) సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా చేస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి సీజన్ అంటే కచ్చితంగా దిల్ రాజు సినిమా ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సినిమా కూడా అన్నిటికంటే ముందు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఎన్ని సినిమాలు తో పాటు అజిత్ నటిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్ని కూడా ఒక ఏరియాలో ఒకే డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ నాలుగు సినిమాలను ఎల్విఆర్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×