BigTV English
Advertisement

Surya Kumar Yadav : ఇన్ని డకౌట్లు.. ఇంత పూర్ పర్ఫామెన్స్.. అయినా సరే స్కైకే సపోర్ట్.. ఏం మాయ చేస్తున్నాడు

Surya Kumar Yadav : ఇన్ని డకౌట్లు.. ఇంత పూర్ పర్ఫామెన్స్.. అయినా సరే స్కైకే సపోర్ట్.. ఏం మాయ చేస్తున్నాడు
Surya Kumar Yadav

Surya Kumar Yadav : సూర్యకుమార్ యాదవ్.. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్. ఐపీఎల్ మొదలయ్యే ముందు అందరు మాట్లాడుకున్నది స్కై గురించే. ఎలా చెలరేగిపోతాడో.. ఎలా అడ్డుకట్ట వేయాలోనని తెగ మదనపడిపోయాడు. కాని, బౌలర్లకు అంత కష్టం ఇవ్వదలచుకోలేదు సూర్యకుమార్ యాదవ్. ప్యాడ్స్ కట్టుకునేంత టైం కూడా గ్రౌండ్‌లో ఉండడం లేదు. మనం టాయిలెట్‌కి వెళ్లి వచ్చే లోపు పెవిలియన్‌లో కూర్చుంటున్నాడు.


ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్‌లలో మొత్తం 16 పరుగులు చేశాడు. ఇందులో హైయెస్ట్ స్కోర్ 15. మూడు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటే ఫోర్. ఇదీ లేటెస్ట్ పర్ఫామెన్స్ రిపోర్ట్.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన సూర్య.. ఐపీఎల్‌-2023లో ఆఖరిగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మరోసారి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. సాధారణంగా ఇంత పూర్ పర్ఫామెన్స్ ఉంటే.. ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తారు. ఇక స్కై పని అయిపోయిందని, పక్కన పెట్టేయండని అంటారు. కాని, అదేంటో.. సూర్య కుమార్ యాదవ్ విషయంలో మాత్రం అందరూ ఇంకా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు.


సూర్యకుమార్‌ ఇంకో 12 సార్లు డకౌట్‌ అయినా ఫర్వాలేదు.. క్షమించేయొచ్చు అంటూ మహ్మద్ కైఫ్ వెనకేసుకొచ్చాడు. స్కై ఒక అద్భుత ఆటగాడని, ఎన్ని ఛాన్సెస్ అయినా ఇవ్వొచ్చని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ బౌలర్లకు చెమటలు పట్టించిన విషయం మరిచిపోకూడదని అన్నాడు. మొన్నా మధ్య రవిశాస్త్రి కూడా ఇలాగే సపోర్ట్ చేశాడు. ఒక్క మ్యాచ్ చాలు.. తిరిగి ఫామ్‌లోకి రావడానికి అని.

సూర్య కుమార్ యాదవ్ కూడా లైట్‌గా తీసుకోవడం లేదు. వచ్చే మ్యాచ్‌లో సత్తా చాటేందుకు నెట్స్‌లో చెమటలు కక్కుతున్నాడు. నెక్ట్స్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తానేంటో నిరూపించుకోవడం కోసం తెగ కష్టపడుతున్నాడు సూర్య కుమార్ యాదవ్.

Related News

Richa Ghosh: మమతా అంటే మాములుగా ఉండ‌దు..రిచా ఘోష్ పేరుతో స్టేడియం, డీఎస్పీ ప‌ద‌వి

Shreyas Iyer: మ‌గాడంటే వాడే, శ్రేయాస్ అయ్య‌ర్ కు పెళ్లాన్ని అయిపోతా..హీరోయిన్ సంచ‌ల‌నం !

Shreyas Iyer: చావు దాక వెళ్లి వ‌చ్చాడు, ఇప్పుడు బీకినీ పాప‌ల‌తో బీచ్ లో ఎంజాయ్ !

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Big Stories

×