BigTV English

Pawan Kalyan: కార్తీ క్షమాపణపై పవన్ కళ్యాణ్ స్పందన.. సూర్య, జ్యోతికలను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే?

Pawan Kalyan: కార్తీ క్షమాపణపై పవన్ కళ్యాణ్ స్పందన.. సూర్య, జ్యోతికలను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే?

Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై  నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్ అయిన విషయం విదితమే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారు ఎవరైనా ఈ వివాదానికి సపోర్ట్ గా మాట్లాడితే ఓకే కానీ,  విరుద్ధంగా మాట్లాడితే అస్సలు బాగోదని ఫైర్ అయ్యారు. నిన్న ఒక ఈవెంట్ లో  హీరో కార్తీ.. లడ్డూ విషయంలో వెటకారంగా మాట్లాడడంపై కూడా పవన్ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం  చేయొద్దని కోరారు .


ఇక దీనికి సమాధానంగా కార్తీ , పవన్ కళ్యాణ్ ను క్షమాపణ కోరాడు. “పవన్ కళ్యాణ్ సార్.. ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను. శుభాకాంక్షలు” అంటూ తెలిపాడు. ఇక కార్తీ  క్షమాపణలు కోరడంపై పవన్ కూడా స్పందించారు. కార్తీని ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా కార్తీ సినిమా సత్యం సుందరం కు బెస్ట్ విషెస్ ను కూడా తెలిపారు.

” కార్తీ గారు.. మీరు మా భాగస్వామ్య సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని అలాగే మీ వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతి, దాని గౌరవప్రదమైన లడ్డూల వంటి మన పవిత్ర సంస్థలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల మనస్సులో లోతైన భావోద్వేగ భారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మనందరికీ చాలా అవసరం. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ పరిస్థితి అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను.


ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి-మన సంస్కృతి మరియు ఆధ్యాత్మిక విలువల గురించి,  ఐక్యత మరియు గౌరవాన్ని పెంపొందించడం.. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత.. సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం, ప్రతిభ మన సినిమాని నిలకడగా సుసంపన్నం చేసిన గొప్ప నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను. సూర్య, జ్యోతిక.. 2D  ఎంటర్ టైన్మెంట్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సత్యం సుందరం సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×