Pawan Kalyan: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ఎప్పుడు అందంగానే కనిపిస్తూ ఉండాలి. లేకపోతే విమర్శలు తప్పవు. అయితే హీరోలు ఇండస్ట్రీలో ఉన్న లేకపోయినా కూడా తమ బాడీని ఫిట్ గా ఉంచుకుంటూనే ఉండాలి. లేకపోతే సోషల్ మీడియాలో టోల్స్ కచ్చితంగా భరించాల్సిందే. ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పవన్ ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి తన బాడీని మార్చుకుంటూనే వచ్చాడు. కాకపోతే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళాక తన బాడీ మీద శ్రద్ధ పెట్టడం మానేశాడు. ప్రచారాలు, మీటింగులు, ప్రజల సమస్యలు ఇలా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు.
అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లి ఒంటి మీద షర్టు లేకుండా స్నానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో షేక్ చేశాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోలలో కాస్త పొట్ట కనిపించడంతో స్టార్ హీరో అని కానీ, డిప్యూటీ సీఎం అని కానీ చూడకుండా పవన్ ను ట్రోల్ చేశారు. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా బాడీ మీద శ్రద్ధ లేదని, అసలు ఇతను హీరో ఏంటి అని, బుగ్గలు, పొట్ట పెంచి దారుణంగా ఉన్నాడని ట్రోలింగ్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కొద్దిగా బాడీ మీద శ్రద్ధ పట్టినట్లు తెలుస్తుంది.
తాజాగా పవన్ తన పర్సనల్ హెయిర్ స్టైలిష్ సెలూన్ ఓపెన్ చేయడానికి జిమ్ డ్రెస్ లోనే వచ్చేసాడు. బ్లూ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్ తో వచ్చిన పవన్ ను చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పవన్ ఈ డ్రెస్ లో చాలా ఫిట్ గా కనిపించాడు. పొట్ట మొత్తం తగ్గిపోయినట్లు కనిపించింది. దీంతో కొన్ని నెలల్లోనే ఇంత ఫిట్ గా పవన్ ఎలా అయ్యాడు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక దీంతో పవన్ డైట్ సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని డైట్ ప్లాన్స్ వైరల్ అవుతున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం ఆ డైట్ సీక్రెట్ ఏంటి అంటే కొన్ని నెలలుగా పవన్ ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తున్నాడట. అది కూడా పోర్షన్ పరంగా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు రెండుసార్లు బ్లాక్ కాఫీ తాగుతున్నడాట. ఆ తర్వాత రెండు మూడు గంటలకు లైట్ గా అన్ని పోషకాలు ఉండే భోజనాన్ని తీసుకుంటాడు. ఇక రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా ఒక గ్లాస్ మజ్జిగ తాగి రోజును ఫినిష్ చేస్తున్నాడు. ఈ విధంగా చేయడం వలనే పవన్ కళ్యాణ్ సుమారు 10 కిలోలు బరువు తగ్గిపోయాడని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ముందు ముందు కూడా పవన్ ఇలాగే బాడీ పై శ్రద్ధ వహించనున్నాడని తెలుస్తుంది .
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ఈ మధ్యనే పవన్ రెండు సినిమాలను ఫినిష్ చేశాడు. హరిహర వీరమల్లు షూటింగ్ మొత్తం పూర్తిచసుకుని రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. ఇంకోపక్క ఓజీ కూడా దసరాకు రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు కాకుండా ఈ మధ్యనే పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ ల అడుగు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాను కూడా ఫినిష్ చేయనున్నారు మరి ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.