BigTV English

Pawan Kalyan : పవర్ స్టార్ ఫస్ట్ ఇన్‌స్టా పోస్ట్‌.. సోషల్ మీడియాలో వైరల్..

Pawan Kalyan : పవర్ స్టార్ ఫస్ట్ ఇన్‌స్టా పోస్ట్‌.. సోషల్ మీడియాలో వైరల్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జులై 4న ఇన్‌స్టా గ్రామ్ ఖాతా తెరిచారు. “ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్” అనే స్లోగన్‌తో ఇన్‌స్టాలోకి అడుగు పెట్టారు. గంటల వ్యవధిలోనే లక్షల మంది ఆ ఖాతాను అనుసరించారు. పవర్ స్టార్ తాజాగా తొలి పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తాజాగా పవన్ తన సినీ కెరీర్‌ పై ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేశారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో దిగిన ఫోటోలతో రూపొందించిన వీడియోను షేర్ చేశారు. “చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను’’ అని ఆ వీడియో ప్రారంభమైంది. ‘‘మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ..’’ అని క్యాప్షన్‌ను పెట్టారు.

మరోవైపు పవర్ స్టార్ ఈ ఏడాది పలు సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. తన మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం జులై 28న విడుదల కానుంది. సుజిత్‌ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘ఓజీ’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో పవన్ నటిస్తున్నారు. పవర్ స్టార్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ ‘హరి హర వీర మల్లు’ రూపొందుతోంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×