Hari Hara Vereramllu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ గురించి మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఎట్టకేలకు ఈ మూవీని మే 9న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మే 9న కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదనే బ్లాస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దానికి కారణం యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). మరి ఆయన ఏం చేశాడు? ‘హరిహర వీరమల్లు’ మే 9న రిలీజ్ అవుతుందా లేదా? అనే వివరాల్లోకి వెళితే…
‘హరిహర వీరమల్లు’ మూవీ వాయిదా తప్పదా ?
‘హరిహర వీరమల్లు’ మూవీ 17వ శతాబ్దంలో సాగే కథతో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఇందులో యోధుడిగా నటిస్తుండగా, నిధి అగర్వాల్, బాబి డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం రత్నం ఈ మూవీని సమర్పిస్తుండగా, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అంతలోనే మెగా అభిమానులను నిరాశపరిచే అప్డేట్ ఇచ్చారు యంగ్ హీరో శ్రీ విష్ణు.
రీసెంట్ గా ‘ఓం బీమ్ బుష్’, ‘స్వాగ్’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో నటిస్తున్న కొత్త మూవీ పేరు ‘సింగిల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ, తమిళ బ్యూటీ ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు తన కొత్త సినిమా ‘సింగిల్’ ని మే 9న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ‘వీరమల్లు ‘ మే 9న కూడా రిలీజ్ కాదా? అందుకే ‘సింగిల్’ మూవీని అదే రిలీజ్ డేట్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా
ముందుగా ‘హరిహర వీరమల్లు’ మూవీని మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ మూవీ షూటింగ్ ఇంకా పూర్తిగా కాకపోవడం, వీఎఫ్ఎక్స్ వంటి పనుల కారణంగా మే 9కి వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ మూవీ మే 9న రిలీజ్ అవుతుంది కదా అనుకుంటే… అంతలోనే శ్రీ విష్ణు ‘సింగిల్’ మూవీకి అదే ముహూర్తాన్ని ఫిక్స్ చేసి బిగ్ బాంబ్ పేల్చాడు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియాలంటే ‘సింగిల్’ మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.