BigTV English
Advertisement

Railway Bridge: చలో మిజోరం.. ఆ రైల్వే బ్రిడ్జి సిద్ధం, వీడియో చూస్తే మతిపోద్ది!

Railway Bridge: చలో మిజోరం.. ఆ రైల్వే బ్రిడ్జి సిద్ధం, వీడియో చూస్తే మతిపోద్ది!

Mizoram Railway Bridge: దేశ వ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.  ముఖ్యంగా భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మిజోరం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రైల్వే లైన్ ను  నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ రాష్ట్ర చరిత్రలో ఇదో మైలు రాయిగా అభివర్ణించారు. మిజోరంను భారత్ లోని ఇతర ప్రాంతాలకు అనుసంధించడానికి ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


సుమారు రూ. 8,500 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం

అస్సాంలోని బైరాబి సరిహద్దు నుంచి ఐజ్వాల్‌ కు దగ్గరగా ఉన్న సైరాంగ్ వరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ ను నిర్మిస్తున్నది. ఈ రైల్వే లైన్ జూలై నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు, ₹7,714 కోట్లు ఖర్చు చేశారు. పూర్తయ్యే సరికి సుమారు రూ. 8,500 కోట్లు ఖర్చు అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ లైన్ మిజోరం రాజధాని ఐజ్వాల్‌ ను తొలిసారి భారత రైల్వే నెట్‌ వర్క్‌ తో అనుసంధానం చేయబోతున్నది. భైరాబి- సైరాంగ్ మధ్య 51.38 కి.మీ కొత్త లైన్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు.  అవి భైరాబి-హోర్టోకి, హోర్టోకి-కాన్పుయి, కౌన్పుయి-మువల్ఖాంగ్, మువల్ఖాంగ్-సైరాంగ్. నాలుగు చోట్ల రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.


నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 18 మంది మృతి

అటు బైరాబి-సైరాంగ్ రైల్వే బ్రిడ్జి పనులు కొనసాగుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఆగస్టు 23, 2023న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మిజోరంలోని సైరాంగ్ గ్రామం సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది. ఈ నిర్మాణ స్థలం ఐజ్వాల్ నుండి దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 18 మంది కార్మికులు చనిపోయారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం కలిగించింది.

Read Also: విశాఖ రైళ్లకు సికింద్రాబాద్ లో నో హాల్టింగ్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వంపై నెటిజన్ల ప్రశంసలు

అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు. “మిజోరాం కనెక్టివిటీకి ఇది అద్భుతమైన న్యూస్. సారంగ్ సమీపంలో వంతెనను పూర్తి చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రయాణం, వాణిజ్యం, పర్యాటకరంగ అభివృద్ధిని మెరుగుపరుస్తుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.  అటు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని నెటిజన్లు సూచించారు.  “ఇంఫాల్ ఇంకా రైల్వేతో కనెక్ట్ కాలేదు. నాగాలాండ్ లోనూ రైల్వే లైన్ లేదు. నార్త్ ఈస్ట్ లో రైల్వే ప్రణాళికల గురించి చెప్పండి” అని మరో నెటిజన్ ప్రశ్నించాడు.

Read Also: వేసవి సెలవుల వేళ రైల్వే గుడ్ న్యూస్, చర్లపల్లి నుంచి 26 ప్రత్యేక రైళ్లు!

Related News

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Big Stories

×