Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఈ పేరుకు ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ సినిమాను పక్కనపెట్టి కంప్లీట్ గా రాజకీయాల పైన దృష్టి పెట్టడం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఒక పండగ వాతావరణం నెలకొనేది. కొన్ని రోజులు ముందు నుంచి ఒక హడావిడి జరిగేది. ముఖ్యంగా ఒక వైబ్ ఉండేది. ఇప్పుడు అది కంప్లీట్ గా పోయింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు కూడా నోచుకోని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఈ విషయాన్ని కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ఇప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో తెలియంది కాదు. ఈ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు రావడం లేదు. ఏడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇది. అయినా కూడా ఈ సినిమా మీద బజ్ పెద్దగా లేదు.
ఓజి మేకర్స్ కు విముక్తి
వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకేసారి తన కెరీర్ లో ఎప్పుడు పెట్టనని సినిమాలకు సైన్ పెట్టాడు చాలామంది పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ చూసి ఇన్ని సినిమాలు ఎలా పూర్తి చేస్తాడు అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వాటిలో కేవలం త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయిన మూడు ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేశాడు. మిగతా ప్రాజెక్టులు అలానే ఉండిపోయాయి. హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఎక్కువ టైం కేటాయించి ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కెరియర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఇచ్చిన తక్కువ రోజులు అయినా కూడా పవన్ కళ్యాణ్ నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చాడు హరీష్. ఇక తాజాగా ఓజి సినిమా కూడా గత ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారు అని అనౌన్స్ చేశారు. అది దాదాపు సంవత్సరకాలం పాటు వాయిదా పడిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
హరిహర వీరమల్లు సినిమాపై మేకర్స్ హైప్
హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైనప్పుడు, చాలా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటే చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఇప్పటికీ రిలీజ్ కాలేదు. రీసెంట్గా జూన్ 12న విడుదల డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ డేట్ కు కూడా సినిమా రిలీజ్ కావట్లేదు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు ఈ సినిమా పైన హైప్ పెంచడానికి దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత రత్నం వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నారు.
PACKUP for GAMBHEERA…
GEAR UP for the RELEASE…See you in theatres on 25 September 2025. #OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/uGucg8BGgo
— DVV Entertainment (@DVVMovies) June 7, 2025