Snake News: మనం రోడ్డు వెంట మామూలుగా నడుచుకుంటే వెళ్తుంటే సడెన్‌గా.. పాము కనబడితే భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తుతాం. పాము ఎక్కడ హానీ చేస్తుందో అని దూరంగా వెళ్లిపోతాం. అయితే కొంత మంది మాత్రం పాములతో పిచ్చి ఆటలు ఆడుతూ ప్రాణాలనే కొనితెచ్చుకుంటున్నారు. మరి కొంత మంది పాముల దగ్గరకు వెళ్లి ఫోటోలకు పోజులిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో మస్త్ వైరలవుతున్నాయి. పాములతో ఆడుతూ.. ప్రాణాలను వదిలిన వారిని కూడా మనం చూసి ఉంటాం. అందుకే విషపూరితమైన పాములతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. తాజా ఓ వార్త తెగ వైరలవుతోంది. కన్నకొడుకును కాటేసిన పామును చంపేయకుండా.. దానిని పట్టుకొని అడవిలో వదిలేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెలగావి జిల్లాలోని కకమరి గ్రామంలో పాము కాటుతో మృతిచెందిన అమిత్ గురులింగ సింధూర్ (10) మరణానికి కారణమైన పామును కుటుంబం క్షమించి, దానిని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టింది. అమిత్, రాత్రి మొబైల్‌లో వీడియోలు చూస్తూ మంచం మీద నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన ఒక నాగుపాము అతని చేతిని కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమిత్ చనిపోయాడు. ఈ సంఘటన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తినప్పటికీ.. వారు పామును చంపాలని అనుకోలేదు.
ALSO READ: Crime News: భార్యను దారుణంగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భర్త
ఆ పాము ఇంట్లోనే ఉండిపోయింది. అమిత్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత, కుటుంబం పామును చంపకుండా, దానిని రక్షించాలని నిర్ణయించింది. అమిత్ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా సంచిలో బంధించి, దగ్గరలో ఉన్న అడవిలో వదిలేశాడు. అయితే ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు అభినందిస్తున్నారు. సాధారణంగా, పాము కాటు వల్ల కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో పామును చంపేందుకు ప్రయత్నిస్తారు.
ALSO READ: పడుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్లిన సింహం.. వీడియో వైరల్
అయితే, అమిత్ కుటుంబం పాముపై సానుభూతిని చూపిస్తూ.. అడవిలో వదిలేసేందకు నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన, పాములు మనుషులను కావాలనే.. హాని చేయవని, అవి కూడా ప్రకృతిలో భాగమని గుర్తు చేస్తుంది. కర్నాటక రాష్ట్రంలో పాముల రక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ ఘటన, పాములను రక్షించేందుకు స్థానిక స్నేక్ క్యాచర్లు చేస్తున్న కృషిని కూడా హైలైట్ చేసింది.