Shreyas Iyer : టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన 2025 సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు కి కెప్టెన్ గా వ్యవహరించాడు. తన కెప్టెన్సీలో ఫైనల్ కి తీసుకొచ్చాడు. ఫైనల్ లో చివరి 15 ఓవర్ల వరకు పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందనే అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ తొలిసారి టైటిల్ ని ముద్దాడింది. లేదంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండో టైటిల్ వచ్చేది. గత ఏడాది శ్రేయస్ కోల్ కతా నైట్ రైడర్స్ కి ఒక టైటిల్ ని అందించాడు. ఈ సారి కూడా పంజాబ్ కి టైటిల్ అందిస్తాడనే అంతా భావించారు. కానీ తృటిలో తప్పింది.
Also Read : Rohit Sharma : వెజ్ ఫుడ్ అడిగినందుకు టీమిండియాపై దాడి.. రోహిత్ శర్మ సంచలనం !
మ్యాచ్ పరంగా పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. కానీ శ్రేయాస్ అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ దుమ్ములేపాడు. దీంతో అయ్యర్ కి అంతర్జాతీయ క్రికెట్ లో రివార్డు కూడా లభించింది. ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా వైట్ బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయాస్ అయ్యర్ ఉన్నట్టు సమాచారం. అలాగే గత కొంత కాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన అయ్యర్ టీమిండియా టీ-20 జట్టులోకి కూడా పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ ప్రస్తుతం కేవలం వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో తన అద్భుత ప్రదర్శన తరువాత అయ్యర్ టీ-20 సెటప్ లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అయ్యర్ ఇప్పుడు వైట్ కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
టెస్ట్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ఇటీవలే నియమితులైన విషయం విధితమే. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రోహిత్ శర్మ టీ-20, టెస్ట్ క్రికెట్ కి గుడ్ చెప్పాడు. ఇక త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ కి వన్డే పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం.. గతంలో తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్ కి తీసుకురావడం.. 2024లో అతని కెప్టెన్సీలో కేకేఆర్ కి టైటిల్ అందించడం.. 2025 ఐపీఎల్ లో రన్నరప్ గా నిలవడం ఇవన్నీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అయ్యేందుకు శుభసూచకాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ మనస్సులో మాత్రం ఏముందో తెలియదు. కెప్టెన్సీ రేసులో ఉన్నాడా..? లేడా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.