BigTV English
Advertisement

Swati Maliwal Medical Checkup: జఠిలమైన స్వాతి ఇష్యూ.. మెడికల్ చెకప్.. దయచేసి ఆపండి!

Swati Maliwal Medical Checkup: జఠిలమైన స్వాతి ఇష్యూ.. మెడికల్ చెకప్.. దయచేసి ఆపండి!

Swati Maliwal Medical Checkup: ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెను కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి వెనుక తీగలాగితే డొంక కదులుతోంది. మెడికల్ చెకప్ కోసం ఎయిమ్స్‌కు వెళ్లారామె. దాదాపు నాలుగు గంటలపాటు డాక్టర్లు చెక్ చేశారు. గురువారం రాత్రి 11 గంటలకు మొదలైన చెకప్, తెల్లవారుజామున మూడున్నర వరకు జరిగింది. ఎక్స్ రే, సీటీ స్కాన్ కూడా చేశారు. స్వాతికి ఇంటర్నల్‌గా ఏమైనా గాయాలు అయ్యాయా అనే కోణంలో ఫోకస్ చేశారు ఢిల్లీ పోలీసులు.


గురువారం ఎంపీ స్వాతిమలివాల్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె చెప్పిన ప్రతీ విషయాన్ని వీడియో షూట్ చేయించినట్టు తెలుస్తోంది. తనను కడుపుపై కొట్టి, కాలుతో తన్నాడని చెప్పినట్టు సమాచారం. సోమవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ప్రతీ సన్నివేశాన్ని పూసగుచ్చి మరీ వివరించారామె. దాదాపు నాలుగు గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ టీమ్ వివరాలు సేకరించి, ఆపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇందులోభాగంగా స్వాతిమలివాల్‌కు రాత్రి ఎయిమ్స్‌కి తరలించి పరీక్షలు నిర్వహించారు. దాడి జరిగిన వెంటనే స్వాతి…  సివిల్ లైన్స్ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పారు. కానీ ఆమె ఫిర్యాదు చేయలేదు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ చేయడం, ఆయన హాజరుకావడం జరిగిపోయింది.


Also Read: PM Modi : సీఏఏపై విప‌క్షాల అసత్య ప్రచారం, ఓటు బ్యాంకు కాదని నిర్లక్ష్యం: పీఎం మోదీ

ఈ వ్యవహారంపై ఆప్-బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం కేజ్రీవాల్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది బీజేపీ ప్రశ్న. ఈ వ్యవహారంపై లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నోరు ఎత్తకుండా ఉండడాన్ని ప్రస్తావించింది. అటు బీజేపీ వ్యవహారశైలిపై ఎంపీ స్వాతి‌మలివాల్ హితవు పలికారు. దయచేసి ఆ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు స్వాతి. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు. బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించాారు. వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదన్న ఆమె, రాజకీయం చేయవద్దని నేతలకు సూచన చేశారు.

Also Read: AmitShah will become PM: బీజేపీకి 400 సీట్లు వస్తే, పీఎంగా అమిత్ షా, కమలనాధుల్లో చర్చ

అసలేం జరిగిందంటే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సోమవారం ఆప్ ఎంపీ స్వాతి‌మలివాల్ వెళ్లారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారన్నది స్వాతి ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ, పోలీసులు స్వాతి ఇంటికి వచ్చి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×