BigTV English
Advertisement

Prabhas Insta Status: అంత ఏం లేదు డార్లింగ్స్.. మళ్లీ ప్రభాస్ మోసం చేశాడు..?

Prabhas Insta Status: అంత ఏం లేదు డార్లింగ్స్.. మళ్లీ ప్రభాస్ మోసం చేశాడు..?

Prabhas Instagram Status about Movie Promotion: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరు చెప్పుకొచ్చేస్తారు. ఎన్ని సినిమాలు తీసినా.. ప్రభాస్ ఫ్యాన్స్ ముఖంలో నవ్వు కనిపించేది మాత్రం డార్లింగ్ పెళ్లి గురించి చెప్పినప్పుడు మాత్రమే. ప్రభాస్ ఎక్కడ కనిపించినా మొట్టమొదటగా అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు..? ఇక డార్లింగ్ సైతం చూద్దాం.. చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటా..? ఇక ఇలాంటి మాటలు చెప్పుకుంటూ రావడమే తప్ప పెళ్లి గురించి అస్సలు మాట్లాడడు.


ఇక హీరోయిన్ అనుష్క తో ప్రభాస్ ప్రేమ అని కొన్నాళ్ళు.. కృతి సనన్ తో ప్రేమ అని ఇంకొన్నాళ్ళు ఇలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, అవేమి నిజం కాదని డార్లింగ్ ఎప్పుడో చెప్పుకొచ్చాడు. హా.. ఇవన్నీ అయ్యే పనుల్లా లేవు. ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా నవ్వుతూ స్పందించడం తప్ప ఆయన గుడ్ న్యూస్ చెప్పేలా లేడు అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఒక పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాను షేక్ చేసింది.

” డార్లింగ్స్.. చివరికి మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వెయిట్ చేయండి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇంకేముంది.. మా డార్లింగ్ పెళ్లి కొడుకాయనే అంటూ ఫ్యాన్స్ పాటలు పాడడం కూడా మొదలుపెట్టారు. ఇక ఆ ఆనందం ఎక్కువసేపు కూడా నిలవలేదు. ఎందుకంటే డార్లింగ్ పెట్టిన పోస్ట్ కేవలం ప్రమోషన్స్ కోసం మాత్రమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే కల్కి సినిమా ఫినిషింగ్ కు వచ్చేసింది. త్వరలోనే రిలీజ్ కు రెడీఅవుతుంది.


Also Read: Mahesh Babu – Rajamouli: ‘SSMB 29’ మూవీలో మలయాళ స్టార్ హీరో.. ఇది మామూలు హైప్ కాదు బాబోయ్..!

ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం రాజాసాబ్. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ ఇంట్రక్షన్ వీడియో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దానికోసమే ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టినట్లు టాక్. ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ప్రభాస్ అన్నా మళ్లీ మోసం చేశాడురా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×