Payal Rajput: టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి మూవీతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. తన హాట్ అందాలతో రొమాంటిక్ సీన్లలో నటించి మెప్పించింది. అయితే మొదటి మూవీ తర్వాత పాయల్ కు ఎక్కువగా అలాంటి సినిమాలే పలకరించాయి. అయితే చాలా కాలం పాటు సరైన హిట్ సినిమా పడలేదు. రీసెంట్ గా మంగళవారం మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటుగా ఎన్నో అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తుంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంది. తాజాగా ఒక తప్పు చేసి అడ్డంగా బుక్కయింది. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పాయల్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో తన పెట్స్ గురించి ఓ షెల్టర్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని కోసం తన టీంలోని ఓ మెంబర్ ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేసింది. అదే ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారం రేపుతుంది. పాయల్ అసలే పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. ఇక పాయల్ ఇప్పుడు తన పెట్స్ కోసం ఆరాట పడుతోంది. రీసెంట్‌గా పాయల్ ఇంట్లో ఉన్న పెట్‌కి పిల్లలు పుట్టినట్టుగా పోస్ట్ చేసింది. అయితే బయట చాలా పెట్స్ ఉన్నాయి. వాటికి కూడా మంచి షెల్టర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా పాయల్ తాజాగా పెట్స్ ను రక్షించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో తన అసిస్టెంట్ నంబర్ ను షేర్ చేసింది. పెట్స్ షెల్టర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయమని కోరింది. మరి పాయల్‌కి పెట్ షెల్టర్ దొరుకుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే పాయల్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.. ప్రస్తుతం ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి అడ్డంగా ఇరుక్కుందని తెలుస్తుంది. మరి దీని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.. ఏది ఏమైనా ఒక సెలబ్రిటీ అయ్యి ఇలా చేస్తే కొందరు దాన్ని తప్పుగా తీసుకొనే అవకాశాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..
Also Read: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ… థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
సినిమాల విషయానికొస్తే..
పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌లో ఆర్ఎక్స్ 100 తప్పా మరేతర చిత్రాలు వర్కౌట్ కాకపోవడం, అది మినహా ఒక్క హిట్ లేకపోవడంతో కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. ఆ తర్వాత అదే జోనర్ లో సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో మళ్లీ అదే డైరెక్టర్ ను నమ్ముకుంది. రీసెంట్ గా మంగళవారం మూవీతో పలకరించింది. ఆ మూవీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా మరో మూవీ చేస్తుంది. అలాగే వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.