BigTV English

HIT 3 Twitter Review: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ… థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

HIT 3 Twitter Review: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ… థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

HIT 3 Twitter Review: టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసేలా రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హిట్ మూవీస్ సీక్వెల్ గా హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూశారు. మొత్తానికి ఆ టైం వచ్చేసింది. నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ నేడు మేడే సందర్బంగా థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..


ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్ తప్ప మిగతావన్నీ డీసెంట్ ఇంటర్వెల్‌తో వర్క్‌ అయ్యాయి. ద్వితీయార్ధం పూర్తిగా భిన్నమైన దిశలో సాగుతుంది. మూవీ అంత బోరింగ్ గా ఏమి లేదు.. నాని యాక్టింగ్ అదిరిపోయింది. తప్పకుండా చూడాలి అని ట్వీట్ చేశారు.

నాని పాత్రకు రిఫ్రెష్ టేక్‌ని అందించారు, అతనిలోని పూర్తి భిన్నమైన కోణాన్ని మాకు చూపారు. దర్శకుడు శైలేష్ కొలను ప్రతి ఫ్రేమ్‌లో వివరంగా చూపిన శ్రద్ధ అద్భుతంగా ఉంది.. కథ ఒకే లైన్ చుట్టూ తిరుగుతుంది: ఒక ఆత్మను రక్షించడానికి, అతను అనేక అవతారాలను తీసుకుంటాడు.. సినిమాను తప్పకుండ చూడాలి అని మరొకరు ట్వీట్ చేశారు.

సెకండాఫ్ డీసెంట్‌గా ఉంది. ఇది OTT నుండి తెలిసిన కాన్సెప్ట్‌ను తీసుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఫైట్స్ హై మూమెంట్స్ అందిస్తూ అద్భుతంగా కొరియోగ్రఫీ చేసారు. నాని ఈ సినిమాను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేశాడు. అతిధి పాత్రలు పని చేస్తాయి. నాని చెప్పినట్లుగా ఈ కాన్సెప్ట్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. సినిమా మొదటి సగం, చివరి 30 నిమిషాలు నాకు బాగా నచ్చాయి. క్లైమాక్స్‌ ఫైట్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌ విషయంలో టీమ్‌ ఆల్‌ అవుట్‌ అయింది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది..

నేచురల్ స్టార్ నానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. నాని బ్రో.. నీ బీస్ట్ అవతారాన్ని చూడటానికి కాచుకొని ఉన్నాను. అర్జున్ సర్కార్‌ పాత్రతో హిట్ 3 బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నావు. ఈ ఫ్రాంచైజీ సక్సెస్ బాటలో కొనసాగిపోతుంది. చిత్ర యూనిట్‌కు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

 

హిట్ 3 మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త డల్ అయ్యింది. సెకండ్ ఆఫ్ లో మాత్రం మూవీ పీక్స్, యాక్షన్ సీన్లతో గూస్ బంప్స్ పక్కా.. సినిమాను భారీ యాక్షన్స్ సీన్స్ తో హైలెట్ చేశారు. క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వొద్దు.. అని మరొకరు ట్వీట్ చేశారు.

 

మొత్తానికి నెటిజన్స్ రియాక్షన్ పాజిటివ్ గానే ఉంది. మూవీ మొత్తం యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాని ఇందులో కనిపించాడు.. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఎంత వసూల్ చేస్తుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×