BigTV English

Peddi: ‘పెద్ది’ ఫస్ట్ షాట్ సెన్సేషన్.. కానీ మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్!

Peddi: ‘పెద్ది’ ఫస్ట్ షాట్ సెన్సేషన్.. కానీ మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్!

Peddi: ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ తేజ్ (Ram Charan). దీంతో.. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది’ సినిమాకు కూడా గ్లోబల్ స్టార్ ట్యాగ్‌నే టైటిల్‌ కార్డ్‌లో వేసుకున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను పెంచేలా లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్‌ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ కొట్టిన సిక్స్‌కు పాన్ ఇండియా లెవల్లో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. గ్లింప్స్ పరంగా పెద్ది ఫస్ట్ షాట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో 36.5 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టి.. అత్యధిక వ్యూస్ రాబట్టిన తెలుగు గ్లింప్స్‌గా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా.. పెద్ది ఫస్ట్ షాట్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.


విశ్వంభర పరిస్థితేంటి?

శ్రీరామనవమి సందర్భంగా.. పెద్దితో పాటు చాలా సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చాయి. కానీ చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం.. ఫ్యాన్స్‌ను కాస్త నిరాశకు గురిచేసినట్టైంది. చిరు లేటెస్ట్ ఫిల్మ్ “విశ్వంభర” (Vishwambhara) మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రంగా రూపొందుతోంది. ఇది ఒక సోషియో-ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి “బింబిసార” ఫేమ్ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావడం లేదు. మొదట 2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, VFX పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ అప్డేట్ కూడా లేదు. కనీసం శ్రీరామ నవమికి కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. అందుకే డిలే అవుతున్నట్టు టాక్. కానీ ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


నెల రోజులే ఉంది సామి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపి డిప్యూటీ సీఎం అయ్యాక రాబోతున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి మరియు ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు ఆది నుంచి అన్ని అడ్డంకులే వస్తున్నాయి. ఏది ఏమైనా.. మార్చి 28 రిలీజ్ చేసి తీరుతామని చెప్పిన మేకర్స్.. చేసేది లేక మరోసారి వాయిదా వేశారు. రెండు భాగాలుగా రానున్న హరిహర వీరమల్లు మొదటి భాగం “హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో 2025 మే 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక్కడి నుంచి చూస్తే.. మరో నెల రోజుల్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నుండి శ్రీరామ నవమికి ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం పండుగ పోస్టర్ కూడా రాలేదు. అయితే.. చిరు, పవన్ నిరాశ పరిచిన.. అబ్బాయ్ చరణ్ మాత్రం.. తండ్రి, బాబాయ్ సినిమాలకు మించిన ట్రీట్ ఇచ్చాడని ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగాభిమానులు. కానీ హరిహర వీరమల్లు ఈసారైనా రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×