BigTV English

Tamannaah: ఇప్పుడు నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను.. తమన్నా సంతోషానికి కారణమేంటో.?

Tamannaah: ఇప్పుడు నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను.. తమన్నా సంతోషానికి కారణమేంటో.?

Tamannaah: ఒకప్పుడు ఏజ్ ఎక్కువయితే సీనియర్ హీరోయిన్స్‌కు అసలు సినిమాల్లో అవకాశాలు రావు అని అంటుండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఏజ్ ఎక్కువయినా, పెళ్లయినా, పిల్లలు పుట్టినా.. తమ కెరీర్‌లను మాత్రం పక్కన పెట్టడం లేదు నటీమణులు. ఇక మేకర్స్ కూడా వారికి తగినట్టుగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అలా ఇప్పటికీ ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్‌గా చలామణి అవుతున్నారు. అందులో తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘ఓదెల 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తమన్నా.. తాజాగా పాల్గొన్న పోడ్కాస్ట్‌లో తన లైఫ్‌కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ షేర్ చేసుకుంది.


జీవితం మారిపోయింది

తమన్నా ఆధ్యాత్మికతను, మెడిటేషన్‌ను విపరీతంగా నమ్ముతుంది. ఈ విషయం తాను స్వయంగా పలుమార్లు బయటపెట్టడంతో ఫ్యాన్స్‌కు కూడా అర్థమయ్యింది. తాజాగా ఈ విషయంపై ఒక పోడ్కాస్ట్‌లో మాట్లాడింది ఈ మిల్కీ బ్యూటీ. ‘‘ఈషా యోగా సెంటర్‌లో నేను చేసిన ప్రోగ్రామ్స్ నాకు చాలా సాయం చేశాయి. మెడిటేషన్, సాధనా.. ఇలాంటి వాటితో నా జీవితం మారిపోయింది. దానివల్లే నేను జీవితంలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతం నా జీవితంలో సాధించింది అంటే ఇదే’’ అంటూ ఈషా ఫౌండేషన్ గురించి గొప్పగా మాట్లాడింది తమన్నా. తనకు మాత్రమే కాదు.. ఇంకా చాలామంది హీరోయిన్లకు ఈ ఫౌండేషన్‌కు తరచుగా వెళ్లే అలవాటు ఉంది.


త్వరగా కోలుకుంటాను

‘‘ఏదో జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అనే ఆలోచన మారిపోయింది. ఏం జరగకపోయినా నేను సంతోషంగా ఉంటాను అనే స్టేజ్‌కు నేను వచ్చేశాను. నేను ఎప్పుడూ సంతోషంగా జీవించడానికే ఇష్టపడతాను. అలా అని నాకు అస్సలు బ్యాడ్ డేస్ లేవని కాదు.. అలాంటి రోజులు వచ్చినా కూడా నేను వాటి నుండి త్వరగా కోలుకోవడం మొదలుపెట్టాను. అందుకే నేను ఈషా యోగా సెంటర్‌లో చేసిన కోర్సులను చాలామందికి రికమెండ్ చేశాను కూడా. కానీ చాలామంది ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు సీరియస్‌గా తీసుకోరు. మెడిటేషన్ అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. అది ఎవరి ఇష్టప్రకారం వాళ్లు చేయాలి. మీ అనుభవాలను బట్టి ఈ కోర్సులు చేయాలని మీకు స్వయంగా అనిపించాలి’’ అని చెప్పుకొచ్చింది తమన్నా.

Also Read: టాక్సీవాలా విషయంలో భయపడ్డా.. అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్..

ఎవరి జీవితం వాళ్లది

‘‘నేను మందు, సిగరెట్ లాంటి తాగను. అసలు మీరు ఎందుకు జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు అడిగి చూశారా? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుందని కాదు.. కానీ ఈ ప్రశ్న వల్ల మంచే జరుగుతుంది. అయినా ఇదంతా ఎవరి అనుభవాల వల్ల వాళ్లు తెలుసుకోవాల్సిందే. ఎంత మాట్లాడుకున్నా, ఎంత అనుభవాలను షేర్ చేసుకున్నా.. చివరికి ఎవరి జీవితం వాళ్లదే’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది తమన్నా (Tamannaah). ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమయిన ఈ ముద్దుగుమ్మ మొదటిసారి తన కెరీర్‌లోనే డిఫరెంట్ పాత్రను ప్లే చేస్తోంది. ‘ఓదెల 2’ (Odela 2)లో అఘోరీగా కనిపించి ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్‌పీరియస్ అందించనుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×