BigTV English

Phani: ఫ్లాప్ హీరోయిన్ గా కేథరిన్.. జర్నలిస్ట్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..!

Phani: ఫ్లాప్ హీరోయిన్ గా కేథరిన్.. జర్నలిస్ట్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..!

Phani:..ప్రముఖ హీరోయిన్ కేథరిన్ త్రెసా (Catherine Tressa) తాజాగా నటిస్తున్న చిత్రం ఫణి(Phani). వి.ఎన్. ఆదిత్య (VN. Aditya) దర్శకత్వం వహించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఇది. కేథరిన్, మహేష్ , శ్రీరామ్, నేహా కృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా యుఎస్ లోనే చిత్రీకరించబడిన ఒక సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. కొత్తగా పెళ్లయిన జంట తమ కొత్త ఇంట్లో ఒక రహస్యమైన గదిని కనుక్కుంటుంది. ఈ సినిమా కథాంశం కూడా ఈ జంట చుట్టూ తిరుగుతుంది. వారు తమ కొత్త ఇంటి చీకటి రహస్యాలను త్వరగానే వెలికి తీయాలని అనుకుంటారు. అందులో ఒక గోడ లోపల ఒక పాము దాగి ఉంటుంది.. ఆ పాము గోడ లోపల ఎందుకు ఉంది? ఆ చీకటి గది రహస్యం ఏమిటి? అనే విషయాన్ని కనుక్కోవడంలో ఆ కొత్తజంట ఎదుర్కొన్న సవాల్ ఏంటి? అనే విషయాన్ని చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మించారు.


కేథరిన్ ఒక ఫ్లాప్ హీరోయిన్ – జర్నలిస్ట్

ఎప్పుడో గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇక దీనిని పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం . ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్ తో పాటు డైరెక్టర్, నిర్మాత పలువురు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇక ప్రెస్ మీట్ లో భాగంగా జర్నలిస్ట్ మాట్లాడుతూ..” కేథరిన్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన తర్వాత మేము సగం సక్సెస్ అయ్యామని మీరు అన్నారు.. పైగా ఇప్పుడు కేథరిన్ సినిమాలు చేయట్లేదు. సినిమా అంటేనే ఒక బిజినెస్. మార్కెట్ పరంగా చూసుకున్నా ఆమె ఒక ఫ్లాప్.. ఎంతవరకు ఈమె వల్ల మార్కెట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు ?”అంటూ ప్రశ్నించగా.. దీనికి డైరెక్టర్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.


ఆమె సైన్ చేసినప్పుడే నా సినిమా సగం హిట్ – వి.ఎన్.ఆదిత్య

డైరెక్టర్ వి.యన్.ఆదిత్య మాట్లాడుతూ..” కేథరిన్ సినిమాలు చేయట్లేదు కాదు ఆమె చేస్తోంది. మన సినిమాతో పాటు తమిళ్లో డైరెక్టర్ సుందర్ . సి (Sundar C) దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళం లో కూడా ఒక సినిమా చేస్తున్నారు . పైగా ప్రతి భాషలో కూడా ఆమెకు మంచి గ్రిప్ ఉంది. మేము ఈ సినిమా కథ చెప్పినప్పటికి ఆమె మూడు , నాలుగు సినిమాలలో నటిస్తోంది. త్వరలో పాన్ ఇండియా చిత్రాలతో కూడా మన ముందుకు రాబోతున్నారు. ఇక మార్కెట్ విషయానికి వస్తే.. ఇవాళ, రేపు మార్కెట్ అనేది తగ్గొచ్చు.. పెరగొచ్చు. అందరూ కూడా చాలా కాన్షియస్ గా సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్న జనరేషన్లో ఉన్నాము.. ముఖ్యంగా పబ్లిక్ లో మంచి పేరు ఉన్నవాళ్లే మన మార్కెట్ కి కారణమవుతారు. అందులో కేథరిన్ ఒకరు. అలా చూసుకుంటే నాకు కేథరిన్ బెస్ట్ ఛాయిస్. అందుకే ఆ ధైర్యంతోనే నా సినిమా సగం సక్సెస్ అని చెప్పాను ” అంటూ జర్నలిస్టుకి ఝలక్ ఇచ్చారు డైరెక్టర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×