Mosquito Repellent Plants: కాలమేదైనా జనాల్ని తీవ్రంగా వేధించే సమస్యల్లో దోమల బెడద కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఒక్కోసారి కంటి నిండా నిద్ర లేకుండా చేసే దోమలు.. ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీయగలవు. ఇదిలా ఉంటే దోమలను ఇంట్లోకి రాకుండా చేయడానికి జనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాయిల్స్, ఆలౌట్, మస్కిటో మ్యాట్‌లను కూడా వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ వీటన్నింటికీ బదులుగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలు నాటడం వల్ల దోమల బెడద నుండి ఈజీగా బయటపడవచ్చు.
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వివిధ ప్రమాదకరమైన వ్యాధులకు దోమలే కారణం. దోమల వల్ల వ్యాప్తి చెందుతున్న వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో బహిరంగ ప్రదేశాల్లో నీరు పేరుకుపోకుండా చూసుకోండి. ఇంటి నుండి దోమలను తరిమి కొట్టడానికి కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచవచ్చు. కొన్ని మొక్కలు దోమలను ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటిని దూరంగా ఉంచడానికి ఇది సులభమైన మార్గం. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే ఎలాంటి మొక్కలు నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంతి చెట్లు:
బంతి పూలు ఇంటిని అలంకరించడానికి ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే బంతి పూల మొక్కలు దోమలను తరిమి కొట్టడంలో మీకు సహాయపడతాయి. బంతి పూల మొక్కలను కుండీలలో లేదా ఏదైనా చిన్న స్థలంలో కూడా సులభంగా నాటుకోవచ్చు. ఈ చెట్టు నుండి వచ్చే వాసనకు దోమలు పారిపోతాయి. ఇంటి చుట్టూ ఈ మొక్కలు ఉంటే దరి దాపుల్లోకి కూడా దోమలు రావు.
వెల్లుల్లి:
ఆహార పదార్థాల రుచిని పెంచే వెల్లుల్లి ఇంట్లో నుండి దోమలను తరిమి కొట్టడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వెల్లుల్లి మొక్కలను ఇంట్లో నాటడం ద్వారా ఆ వాసనకు దోమలు దూరంగా వెళ్లిపోతాయి. దోమలను చంపే సామర్థ్యం కూడా వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటుంది.
Also Read: రాగి బాటిల్‌లోని.. నీళ్లు తాగుతున్నారా ? డేంజర్‌లో పడ్డట్లే !
వేప:
వేప చెట్లు ఇంట్లో నాటడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వేప చెట్టు వల్ల దోమలు, ఇతర కీటకాల నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా వేప చెట్లు ఇంట్లో నాటితే చిన్న చిన్న కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. దీని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గాలిని శుద్ది చేయడంలో కూడా ఉపయోగపడతాయి. అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో వేప చెట్లను నాటాలి.