BigTV English

Jagan: కంగారు‌పడుతున్న జగన్.. అడ్వకేట్లతో వరుసగా భేటీలు, ఎందుకు?

Jagan: కంగారు‌పడుతున్న జగన్.. అడ్వకేట్లతో వరుసగా భేటీలు, ఎందుకు?

Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు భయం పట్టుకుందా? మరోసారి అరెస్టు కావడం తప్పదని భావించారా? బెంగుళూరు ప్యాలెస్‌లో వరుసగా అడ్వకేట్లతో ఎందుకు భేటీ అవుతున్నారు? అరెస్టు కాకుండే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇంతకీ న్యాయవాదులు ఏమన్నారు? గడిచిన ఆరేళ్లు కేసుల విషయంలో కనీసం కోర్టు గడప తొక్కలేదు మాజీ సీఎం. అధికారం కోల్పోయిన తర్వాత వీసా విషయంలో న్యాయస్థానానికి వెళ్లలేదు.


కంగారు‌పడుతున్న జగన్?

ఏపీలో వైసీపీ అధినేత జగన్‌కు భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. లిక్కర్ కుంభకోణం లో వరుసగా జగన్ అండ్ కో టీమ్‌ని అరెస్టు చేశారు సిట్ అధికారులు. మహా అంటే ఆ జాబితాలో మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అరెస్టయివారు లిక్కర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు తేల్చారు. అలాగే ముందస్తు బెయిల్‌పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది కూడా.


దీంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని భావిస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టయిన వాళ్లంతా పైనుంచి ఆదేశాల మేరకు చేశామని నిందితులు సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. అందులో ఒకరు లేదు ఇద్దరు అప్రూవర్‌గా మారే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలను తన వేగుల ద్వారా తెలుసుకున్నారు మాజీ సీఎం జగన్. అరెస్టయిన నిందితులంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారట. దీంతో జగన్‌కు మరింత టెన్షన్ పెరిగినట్టు సమాచారం.

ALSO READ: ఏపీలో కొత్త పథకం.. ఫ్యామిలీకి 25 లక్షల వరకు

న్యాయవాదులతో భేటీలు?

ఈ క్రమంలో ఢిల్లీ నుంచి సీనియర్ అడ్వకేట్లను బెంగుళూరుకి రప్పించుకుని వరుసగా భేటీలు నిర్వహించారని సమాచారం. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా, కనీసం కోర్టు మెట్లు ఎక్కకుండా చూడాలని న్యాయవాదులకు చెప్పారట. ఒకవేళ అరెస్టయితే వెంటనే బెయిల్ వచ్చేలా చూడాలని చెప్పినట్టు సమాచారం.

రెండురోజులుగా బెంగుళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షం దాటికి మునిగిన ప్రాంతాల్లో జగన్ యలహంక ప్యాలెస్ ఉందట. వర్షం వల్ల ఆ ప్యాలెస్ నుంచి న్యాయవాదులు చిక్కుకున్నారని, ఆ తర్వాత బయటపడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో న్యాయవాదుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

గడిచిన ఆరేళ్లు ఆస్తుల కేసులో న్యాయస్థానికి వెళ్లలేదు మాజీ సీఎం జగన్. కార్యక్రమాలు, రివ్యూ మీటింగులు అని చెప్పి తప్పించుకున్నారు. ఒకవేళ ఏపీలో ఉంటే న్యాయస్థానానికి హాజరుకావాల్సి వుంటుందని భావించి తాడేపల్లి నుంచి యలహంకకు మకాం మార్చేశారు.

ఏపీలో వైసీపీ అధికారం పోయి దాదాపు ఏడాది గడుస్తోంది. ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు జగన్. పాస్‌పోర్టు విషయంలో న్యాయస్థానం అడ్డంకులు చెప్పడంతో చివరకు లండన్‌లో కూతురు పుట్టిన వేడుకులకు జగన్ దూరంగా ఉన్న విషయం తెల్సిందే. లిక్కర్ కుంభకోణంలో జగన్ కోర్ టీమ్ మాత్రమే చిక్కుకుంది. ఈ విషయంలో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదు. అరెస్టయిన వాళ్లంతా వైఎస్ఆర్ హయాం నుంచి జగన్‌తో ఉన్నవారేనని తెలుస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×