Prabhas: సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల సంరక్షణ కోసం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో హైదరాబాద్ (Hyderabad)పోలీసుల రూటే సపరేట్ అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రెండ్ సెట్ చేస్తూ వాహనదారులలో అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయితే తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Traffice Police) ఏకంగా ప్రభాస్ సినిమాలోని డైలాగులతో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. తాజాగా ప్రభాస్ (Prabhas) డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ (The Raja Saab) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
హలో బండి కొంచెం మెల్లగా…
ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ లాగా ఉన్నాయని చెప్పాలి. గత కొంతకాలంగా ప్రభాస్ ను ఇలా చూసింది చాలా అరుదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించడం, అద్భుతమైన డైలాగులు చెప్పడంతో ఈ టీజర్ కు మంచి ఆదరణ లభిస్తుంది.
హెల్మెట్ ధరించండి.. నెమ్మదిగా వెళ్లండి..
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ “హలో బండి కొంచెం మెల్లగా”, “అసలే మన లైఫ్ అంతంత మాత్రమే” అంటూ చెప్పే డైలాగులు మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ డైలాగులను ఉపయోగించి హైదరాబాద్ పోలీసులు ఒక వీడియోని చిత్రీకరించి వినూత్నంగా వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో భాగంగా… సాహో సినిమాలోని ‘ఇట్స్ షో టైమ్’ అనే ప్రభాస్ డైలాగ్ తో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే బైక్ మీద రయ్ మంటూ దూసుకెళ్తాడు. అప్పుడే రాజాసాబ్ లోని ‘హలో హలో బండి కొంచెల మెల్లగా’ అనే డైలాగ్ వస్తుంది. ఆ సమయంలో ప్రభాస్ మిర్చి సినిమాలో బైక్ మీద స్లోగా వచ్చే ప్రభాస్ సీన్ ను యాడ్ చేశారు. ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ అంటూ రాజాసాబ్ డైలాగ్ ను ఇరికించేశారు. చివర్లో మిర్చిలో ప్రభాస్ హెల్మెట్ తీసే సీన్ ను ప్లే చేసి.. ‘హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి అంటూ చివరిన క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: Akash Puri: కుక్కలకు అన్నం పెట్టలేని స్థితిలో పూరి… ఇంత నరకం అనుభవించారా?
#HYDTPweBringAwareness
📢ℋℯ𝓁𝓁ℴ… ℋℯ𝓁𝓁ℴ….!
బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.
🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు వాహనదారులకు కల్పిస్తున్న అవగాహన తీరు అందరికీ ఎంతగానో నచ్చింది. అదేవిధంగా మరికొందరు మాత్రం ఈ వీడియో పై ఫన్నీగా కూడా కామెంట్లు చేస్తున్నారు.. ప్రభాస్ సినిమాకు ట్రాఫిక్ పోలీసులు ఇలా కూడా ప్రమోట్ చేస్తున్నారా? అంటూ ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఒకవైపు ప్రభాస్ సినిమాకు మంచి ప్రమోషన్ తో పాటు అందరికీ ఒక అద్భుతమైన మెసేజ్ అందించారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.