Akash Puri: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకులలో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)ఒకరు. ఇక అందరి దర్శకుల మాదిరిగా కాకుండా పూరి జగన్నాథ్ సినిమాలు చాలా విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క దర్శకుడు తమ సినిమాలలో హీరోలకు మంచి ఎలివేషన్స్ ఇస్తూ హీరోలుగా చూపిస్తే పూరి జగన్నాథ్ మాత్రం హీరోలను విలన్లుగా నెగిటివ్ పాత్రలలో చూపిస్తూ హిట్ అందుకుంటారు. ఇలా సినిమాలు చేయడంలో పూరి జగన్నాథ్ కు ఎవరు సాటిరారని చెప్పాలి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న వారే. ఇకపోతే గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించ లేకపోతున్నారు.
భిక్షాందేహీ…
పూరి జగన్నాథ్ చివరిగా డబల్ ఇస్మార్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈయన విజయ్ సేతుపతితో(Vijay Sethupathi) భిక్షాందేహి (Biksham Dehi)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇకపోతే పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సంపాదించినప్పటికీ ఆ డబ్బులను సినిమాల కోసమే పోగొట్టుకున్నారనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈయన కుమారుడు నటుడు ఆకాష్ పూరి (Akash Puri)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అన్నం పెట్టలేని పరిస్థితి..
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తను తన ఫ్యామిలీ గురించి తన తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి తెలియజేశారు. తాము చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో నాన్న సినిమాలలో సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నారు కానీ ఈ విషయాలు మాకు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారని ఆకాష్ తెలిపారు. మేము హాస్టల్స్ లో ఉండటం వల్ల ఈ విషయాలు మాకు తెలియలేదు. నాన్న సినిమాల కోసం తన ఇల్లు, కార్లు అన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఒకానొక సమయంలో ఇంట్లో ఉన్న కుక్క పిల్లలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో మా కుటుంబం ఉందని ఆకాష్ తెలిపారు.
స్టూడియోల చుట్టూ తిరిగేవాన్ని…
ఇలా కుక్క పిల్లలకు కూడా ఫుడ్ పెట్టలేని స్థితిలో నాన్న తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కుక్క పిల్లలను తీసుకెళ్ళమని చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దాదాపు ఓ ఐదు సంవత్సరాల పాటు ఎంతో నరకం అనుభవించారని, కానీ నాన్న ఏ మాత్రం నమ్మకం కోల్పోకుండా తిరిగి బ్యాక్ బౌన్స్ అయ్యారని తెలిపారు. ఒకవేళ నాన్న తిరిగి ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతే నేను ఇప్పటికి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేవాన్ని కాదు, ఫోటోలు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవాడినని తెలియజేశారు. ఇక మేము ఎలాంటి సిచువేషన్ లో ఉన్న అమ్మ సపోర్ట్ మాత్రం నాన్నకు చాలా బాగా ఉంటుందని, అమ్మ అందరిని ఎంకరేజ్ చేస్తుందని, ఫ్యామిలీకి తనే పిల్లర్ అంటూ తన అమ్మ గొప్పతనం గురించి కూడా ఆకాష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఆకాష్ కూడా హీరోగా పలు సినిమాలలో నటించారు కానీ అనుకున్న స్థాయిలో ఇప్పటివరకు సక్సెస్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఆకాష్ బిజీగా గడుపుతున్నారు.
Also Read: Actor Arya: నటుడు ఆర్యకు బిగ్ షాక్ …ఇల్లు రెస్టారెంట్లపై ఐటి దాడులు!