BigTV English

2024 Tollywood Movies: ఎలక్షన్స్ రెడీ.. సినిమాలు కూడా సిద్ధమయ్యాయి..

2024 Tollywood Movies: ఎలక్షన్స్ రెడీ.. సినిమాలు కూడా సిద్ధమయ్యాయి..

Upcoming Political Movies 2024 in Tollywood: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ ప్రచారాలలో బిజీ బిజీగా ఉన్నారు. ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమైపోతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు సినిమాల ద్వారా కూడా తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్రాలు చేస్తున్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..


వ్యూహం:

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘వ్యూహం’. రెండు భాగాలుగా ఈ మూవీ రూపొందుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలు. ఆపై ఎదురైన సవాళ్లును జగన్‌ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొన్నాడు అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించారు.


పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన ఆర్జీవీ.. టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఈ సినిమాను చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని ఆరోపిస్తూ.. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఆగిపోయింది. కోర్టులో సమస్య వీడితే గానీ థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాని పరిస్థితి ఏర్పడింది.

యాత్ర 2:

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర2’ పేరుతో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

2019 ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలు, జగన్‌ను తొక్కేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు?.. వాటన్నింటిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనే అంశాల ఆధారంగా ‘యాత్ర 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రతినిధి 2

ఇక ఈ సినిమాలతో పాటు మరికొన్ని రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. వైసీపీ పార్టీకి అనుకూలంగా రూపొందుతున్న ‘వ్యూహం’, ‘యాత్ర2’ చిత్రాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ వైపు నుంచి కూడా పలు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా నారా రోహిత్ హీరోగా నటిస్తున్న మూవీ ‘ప్రతినిధి2’. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా వెల్లడి కాలేదు.

రాజధాని ఫైల్స్

దీంతోపాటు రాజకీయ నేపథ్యం ఆధారంగా మరోక చిత్రం రూపొందుతోంది. అదే ‘రాజధాని ఫైల్స్’. అమరావతి రైతుల పోరాటాలు.. వారి కష్టసుఖాల్లో ప్రభుత్వం పాత్ర, నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. దాదాపు ఈ మూవీని ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.

కెమెరామెన్ గంగతో రాంబాబు

ఇక ఈ మూవీలతో పాటు ఇదివరకే రిలీజైన మరో మూవీ కూడా థియేటర్లలో మళ్లీ విడుదల కావడానికి సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీ రీరిలీజ్‌ కానుంది. ‘యాత్ర2’ మూవీకి పోటీగా ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాత్ర2 మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుండగా.. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని ఫిబ్రవరి 7న అంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×