BigTV English

Dead Body In Car : మణికొండలో కలకలం.. కారులో మృతదేహం..

Dead Body In Car : మణికొండలో కలకలం.. కారులో మృతదేహం..
Hyderabad news today

Dead Body In Car(Hyderabad news today): మారుతి కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో ఓ మారుతి కారులో మృతదేహం ఉండడం స్థానికులు గమణించారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు.


అనంతరం పోలీసులు కారులో డ్రైవర్ వెనక సీట్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించి విచారణ జరపగా.. ఆ మృతదేహం మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. ఇక మృతుడి వివరాల గురించి ఆరాతీసిన పోలీసులు ఈ నెల 4న రమేష్ తన స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లినట్లు తెలిసింది. అయితే రమేష్ మృతి పైన పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసుల రమేష్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎదైన గొడవ జరగడంతో రమేష్ హత్యకు గురైయ్యాడా? లేక అనారోగ్యం కారణంగా మరణించాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేప్పట్టారు.


మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్, అలానే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసు చేధించడానికి ప్రయత్నిస్తున్నారు. రమేష్ మృతి గురించి తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×