BigTV English

Pooja Hegde : నిర్మాతలకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న పూజా.. అసలు కారణం ఇదేనా..?

Pooja Hegde : నిర్మాతలకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న పూజా.. అసలు కారణం ఇదేనా..?
Pooja Hegde

Pooja Hegde : నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో బీజీ హీరోయిన్ అంటే పూజా హెగ్డే.. అయితే ప్రస్తుతం ఉన్న ఆఫర్లు పోవడం ఒకపక్క అయితే కొత్త ఆఫర్లు లేక పూజ టాలీవుడ్ నుంచి అకస్మాత్తుగా మాయం అయిపోయిందా అనిపిస్తుంది. చాలామంది దీనికి కారణం లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల అని అనుకుంటున్నారు. కానీ నిజానికి అది నిజం కాదు.. అసలు విషయం వేరే ఉంది.


పూజాకు ఆఫర్స్ రాకపోవడానికి పెద్ద కారణం ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్. ఇప్పటివరకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తో పోల్చుకుంటే పూజ రెండు మూడు రెట్లు ఎక్కువ అడుగుతోందని టాక్. పైగా ఆమెతోపాటు వచ్చే స్టాఫ్ కి సంబంధించిన ఖర్చులతోపాటు హోటల్, తిండి ఖర్చులు మొత్తం నిర్మాతలే భరించాలట. దీంతో పూజా వైపు చూడాలంటేనే నిర్మాతలు భయపడే స్థితి ఏర్పడిందని టాక్. అంత బడ్జెట్ ఎందుకు అనుకున్న వాళ్ళందరూ పూజా బదులు శ్రీలీల మంచి ఆప్షన్ అని ఫిక్స్ అయిపోతున్నారు.

గతంలో పూజా ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకునేదట. అయితే ఈ భామ ఇప్పుడు ఏకంగా తన రెమ్యూనరేషన్ ను ఎనిమిది కోట్లు చేసిందంటున్నారు. పూజా సడన్‌గా ఇంత డిమాండ్ చేయడానికి అసలు కారణం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే అని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్ గా ఒప్పుకున్న తర్వాత పూజా బాలీవుడ్ లో మరొక చిత్రానికి కమిట్మెంట్ ఇచ్చింది. అయితే రెండు చిత్రాల మధ్య షెడ్యూల్స్ పరంగా క్లాష్ రావడంతో గుంటూరు కారానికి బై బై చెప్పింది.


ఇక పూజా ప్లేస్ లో శ్రీలీల గుంటూరు కారంలో ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ లో హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్ భారీగానే ఇస్తారు. అక్కడ ఆ రుచి మరిగిన తర్వాత టాలీవుడ్ లో మూవీకి సైన్ చేయాలి అంటే కచ్చితంగా అదే రేంజ్ రెమ్యూనరేషన్ అడుగుతోంది పూజా. ఇక ఆ దెబ్బతో నిర్మాతలు పూజాను హీరోయిన్ గా తీసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్‌గా సాయిధరమ్ తేజ ,సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి హీరోయిన్‌గా పూజా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేథ్యంలోనే సాయిధరమ్ తేజతో మూవీకి పూజా ఎంత తీసుకుందో అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×