Pooja Hegde.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) తొలిసారి తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె..రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. అయితే ఆ తరువాత సడన్గా కెరియర్ డౌన్ అవడం మొదలైంది. టాలీవుడ్ లో కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. అదే సమయంలో పూజా.. తన స్టాఫ్ కి జీతభత్యాలు, విలాసాల పేరుతో నిర్మాతల నుంచి భారీగా డిమాండ్ చేస్తూ ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి.
అయోమయంలో పడ్డ పూజా కెరియర్..
అయితే ఇలా కారణాలు ఏవైనా సరే.. టాలీవుడ్ నుంచి ఈమె దూరం అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరొకవైపు కోలీవుడ్ లో కూడా అగ్ర హీరోలు అవకాశాలు ఇచ్చినా.. సరైన విజయం అందక వెనుకబడిపోతుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే నటిస్తోంది. అక్కడ కూడా అరకొరగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ‘దేవా’ సినిమా లో మాత్రమే నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor) లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం లభించింది.. కానీ ఈ సినిమా ఫలితం ఆమెకు ఎంత మేరకు కలిసి వస్తుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు ఈ సినిమా కూడా ఈమెకు అంతగా కలిసి రాదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే షాహిద్ డామినేషన్ ముందు ఏది నిలబడదు. అలాంటిది నటీనటుల పరిస్థితి ఏంటి? అతడు రౌడీ పోలీస్ పాత్రలో ఇరగదీస్తున్నాడు. ముఖ్యంగా షాహిద్ గెటప్, యాక్షన్, డాన్సులు ఇలా ప్రతిదీ కూడా హైలెట్ కావడంతో పూజా హెగ్డే అంతగా హైలైట్ కాదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
పూజాకి ఇదే చివరి సినిమా కానుందా..
ఇక ఈమెను ఇక్కడ తక్కువ చేసి చూపిస్తుండడంతో ఈసారి కూడా ఈమెకు గుర్తింపు లభించడం కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే వాస్తవానికి షాహిద్ కపూర్ మంచి డాన్సర్. ఈయన ఎనర్జీ స్టెప్పుల ముందు పూజ తేలిపోయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈమెను గనుక తక్కువ చేసి చూపిస్తే.. ఈ సినిమా విజయం సాధించిన ఫలితం లభించదు. ఇక మరోవైపు పూర్తిగా హైడ్ చేసినట్టుగా కనిపిస్తోంది. భారీ యాక్షన్ చిత్రంగా వస్తున్న దేవా విజయం సాధిస్తే ఈమెకు మరో అవకాశం లభించే అవకాశం ఉంది. లేదంటే ఇదే చిట్టచివరి అవకాశంగా భావించాల్సి ఉంటుందని కూడా సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి పూజ ఇప్పటికైనా మేల్కొని తన సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి అని, మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. మరి ఈమెకు ఇండస్ట్రీలో భవిష్యత్తు ఎంత మేరా ఉందో చూడాలి.