Knee Pain: చలికాలంలో మోకాళ్ల నొప్పులు సాధారణంగా వచ్చే సమస్య. జలుబు కారణంగా కండరాలు కుంచించుకుపోయి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. చాలా మందికి వింటర్ సీజన్ అంటే ఇష్టం. కానీ ఈ సీజన్‌లో చాలా మందికి మోకాళ్ల నొప్పుల సమస్య కూడా పెరుగుతుంది. మోకాళ్ల నొప్పుల విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. సరైన జీవనశైలి, హోం రెమెడీస్ మోకాలి నొప్పి నుండి ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మరి చలికాలంలో మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హాట్ కంప్రెస్:
హాట్ వాటర్ బాటిల్: వేడి నీటి బాటిల్ తీసుకుని టవల్‌లో చుట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
లవంగం నూనె: కాస్త వేడి నీటిలో కొద్దిగా లవంగం నూనె కలపండి. తర్వాత ఒక గుడ్డను అందులో ముంచి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి.
పసుపు పేస్ట్:
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో పసుపు పేస్ట్ అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అల్లం:
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
అల్లం టీ: అల్లం తురుము, వేడినీటిలో వేసి 10-15 నిమిషాలు మరిగించాలి.
అల్లం వాడకం: మీరు కూరగాయలల్లో అల్లం కూడా కలిపి తినవచ్చు
నిమ్మరసం:
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యానికి మంచిది.
నిమ్మరసం: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.
యోగా, వ్యాయామం:
క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
సూర్య నమస్కారం:
సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.
స్విమ్మింగ్: కీళ్లకు కూడా స్విమ్మింగ్ మంచి వ్యాయామం.
ఆహారం:
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చేపలు, వాల్‌నట్‌లు ,చియా గింజలలో ఉంటాయి. ఇవి కాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్ డి: విటమిన్ డి పాలు, గుడ్లు, సూర్యకాంతి నుండి లభిస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది.
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందించడంలో ఆవాల నూనెతో ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం, ఆవాల నూనె వేడి చేసి ఈ నూనెను రాసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ హోం రెమెడీని సిద్ధం చేయడానికి, కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని ఆవాల నూనెలో ఉడికించాలి. నూనె కాగిన తర్వాత కీళ్లకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. మీరు కొంతకాలంగా ఉన్న ఈ నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
Also Read: డయాబెటిక్ పేషెంట్లు ఉదయం పూట తప్పకుండా తినాల్సినవి ఇవే !
అల్లం: కీళ్ల నొప్పులకు కూడా అల్లం ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడానికి సులభమైన మార్గం అల్లం టీ తాగడం. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు అల్లంలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు కొనసాగితే, మీరు ప్రతిరోజూుఉదయం, సాయంత్రం అల్లం టీ తాగాలి. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో మీకు సహాయపడుతుంది.