China Tibet Military | భారత్ పొరుగుదేశమైన టిబెట్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో చైనా భారీగా సైనిక విన్యాసాలను ప్రారంభించింది. చైనా సైనిక విభాగమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అత్యంత క్లిష్టమైన వాతావరణ ప్రదేశాలలో యుద్ధ సన్నద్ధతను మెరుగుపరచడంపై దృష్టి సారించగా.. ఈ విన్యాసాల్లో లాజిస్టిక్స్ సరఫరా, సైనిక సన్నద్ధత వంటి అంశాలను కూడా ప్రణాళికబద్దంగా చైనా అమలు చేస్తోంది. కానీ మరి కొన్ని రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే ఉన్న తరుణంలో, చైనా ఈ విన్యాసాలను మొదలుపెట్టడం గమనార్హం.
అత్యాధునిక టెక్నాలజీతో సైనిక విన్యాసాలు
చైనాలోని షింజియాంగ్ మిలటరీ కమాండ్‌కి చెందిన రెజిమెంట్ ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఈ విన్యాసాలలో అత్యాధునిక సైనిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు చైనా ప్రకటించింది. వాటిలో ఆల్-టెర్రైన్ వాహనాలు (vehicles), అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్, డ్రోన్లు, ఎక్సో-స్కెలిటెన్స్ వంటి పరికరాలను పిఎల్ఏ సైనికులు వినియోగిస్తున్నారు. ఈ విన్యాసాలు చైనా సైనిక సన్నద్ధతను పెంచేందుకు, అత్యంత కఠిన వాతావరణంలో యుద్ధం కొనసాగించేందుకు సహాయపడతాయని సైనికాధికారులు చెబుతున్నారు.
Also Read: గ్రీన్‌లాండ్ కొనుగోలు చేస్తానన్న ట్రంప్.. ఎంత ధరవుతుందో తెలుసా?
భారత్ అప్రమత్తత
ఈ విన్యాసాలను దృష్టిలో ఉంచుకుని, భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ విన్యాసాలు దిల్లాఖ్ ప్రాంతానికి సమీపంలో జరుగుతున్నందున, భారత సైన్యం కూడా జాగ్రత్తగా ముందుకు వెళుతోంది. భారత సైన్యం గతంలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత్-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా ఇండియన్ ఆర్మీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
చైనా లాజిస్టిక్స్ ఎక్సర్‌సైజ్‌లు
తాజాగా, బీజింగ్ చైనా చేపట్టిన లాజిస్టిక్స్ సపోర్ట్ ఎక్సర్‌సైజ్‌లు చాలా వ్యూహాత్మకమైనవి. ఈ విన్యాసాల్లో, అత్యంత ఎత్తైన ప్రదేశాలలో సైనిక దళాలకు అవసరమైన పరికరాలు, ఆహారం, సరఫరాలు వేగంగా సరఫరా చేయడంపై ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగా, చైనా సైన్యం వాతావరణ పరిస్థితులు సవాలుగా మారే దిశగా ఎక్సో-స్కెలిటెన్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది.
2020 గల్వాన్ ఘర్షణ – ఆ తర్వాత పరిస్థితులు
2020లో గల్వాన్ లోయలో జరిగిన భారత్-చైనా సైనిక ఘర్షణ అనంతరం ఈ ప్రాంతం అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఆ ఘర్షణతో సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అయితే ఆ తరువాత భారత్, చైనా సైన్యాలు దౌత్య వేదికలపై చర్చలతో పరిస్థితిని కొంత శాంతపరిచాయి. 2022లో అక్టోబర్ నెలలో కీలక ఒప్పందం కూడా జరిగింది, ఫలితంగా ఇరు దేశాలు కొన్ని బలగాలను బార్డర్ వద్ద నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.
ఇండియన్ ఆర్మీ డ్రిల్స్
మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా తన పోరాటపటిమను పెంచుకునేందుకు నిఘా, జవాన్ల సమన్వయంతో హిమాలయాల్లో ప్రతి సంవత్సరం ‘‘హిమ్ విజయ్’’ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ డ్రిల్స్‌లో, అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో వివిధ దళాల మధ్య సమన్వయంతో ఆపరేషన్లను నిర్వహించడంపై సైనికులు సాధన చేస్తున్నారు. భారత సైన్యం కూడా అత్యాధునిక సర్వైలెన్స్ సిస్టమ్స్, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లను ఉపయోగిస్తూ చైనా సైన్యానికి సంబంధించిన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది.
భారత్ సరిహద్దుల్లో కీలకమైన రోడ్లు, వంతెనలు, సొరంగాల నిర్మాణాలను వేగవంతం చేసింది. ఈ కొత్త నిర్మాణాలు.. దళాల కదలికను మరింత సులభంగా, వేగంగా చేయడానికి సహాయపడతాయి.
మొత్తంగా చూస్తే చైనా, భారత్ సరిహద్దులో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.