BigTV English
Advertisement

Pooja Hegde: ఆమె కోసం పూజా హెగ్డేను గురూజీ ప‌క్క‌న పెట్టేశారా!

Pooja Hegde: ఆమె కోసం పూజా హెగ్డేను గురూజీ ప‌క్క‌న పెట్టేశారా!
Pooja Hegde: ఆమె కోసం పూజా హెగ్డేను గురూజీ ప‌క్క‌న పెట్టేశారా..!


Pooja Hegde: టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో త్రివిక్ర‌మ్ ఒక‌రు. ఆయ‌న చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. సూపర్‌స్టార్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను జూన్ 24 నుంచి జ‌రుపుకోనుంది. ఈ నెల మొద‌టి వారంలోనే ప్రారంభం కావాల్సిన ఈ షెడ్యూల్ వాయిదా ప‌డ‌టానికి కార‌ణాలు మాత్రం తెలియ‌టం లేదు. కాగా.. ఈ నేప‌థ్యంలో ‘గుంటూరు కారం’ సినిమాపై రెండు ప్ర‌ధాన‌మైన రూమ‌ర్స్ వినిపించాయి. అవేంటంటే త‌మ‌న్‌ను తీసేసి అనిరుద్‌ను తీసుకున్నార‌ని. అయితే ఆ వార్త‌ల‌ను వెంట‌నే చిత్ర యూనిట్ ఖండించింది. త‌మ‌న్ కూడా ఆ విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు.

కాగా ‘గుంటూరు కారం’పై వినిపించిన మ‌రో ప్ర‌ధాన‌మైన రూమ‌ర్‌, హీరోయిన్‌ను మార్చేశార‌ని. ముందుగా ప్ర‌క‌టించిన హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఇప్పుడామెను మార్చేశారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ రూమ‌ర్స్‌ను మాత్రం టీమ్ ఖండించ‌లేదు. అయితే తాజాగా ఈ రూమ‌ర్‌కి మ‌రో రూమ‌ర్ జోడైంది. అదేంటంటే.. పూజా హెగ్డే ప్లేస్‌లో సంయుక్తా మీన‌న్ న‌టించ‌నుంద‌ని. త్రివిక్ర‌మ్ స్పెష‌ల్ రిక్వెస్ట్‌తోనే సంయుక్తా మీన‌న్‌కి ‘గుంటూరు కారం’లో అవకాశం వ‌చ్చిదంటూ న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. రొటీన్‌కు భిన్నంగా త్రివిక్ర‌మ్ ఈ సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో తెర‌కెక్కిస్తున్నారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా శ్రీలీల న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×