Poonam Kaur : ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పూనమ్ కౌర్ (Poonam Kaur).. తాజాగా కొండా సురేఖ సమంత పై చేసిన వ్యాఖ్యలపై సినీ సెలబ్రిటీలు స్టాండ్ తీసుకుంటున్న నేపథ్యంలో.. పూనమ్ చేసిన పోస్ట్ ఒకటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. సమంత, అక్కినేని ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. యావత్ సినీ సెలబ్రిటీలంతా ఒక్కటయ్యారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి, సమంతకు అండగా నిలుస్తూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్ లు వేస్తున్నారు. జూనియర్ హీరోలను మొదలుకొని సీనియర్ స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ విషయం మీద టాలీవుడ్ అంతా ఏకతాటిపైకి రావడం అభినందించదగ్గ విషయమే. అయితే ఇది అందరి విషయంలో ఉంటే బాగుండేది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడున్న ఐక్యమత్యం అప్పుడేమైంది..
ముఖ్యంగా దివంగత నటుడు ఎన్టీఆర్ కూతురి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సినీ సెలబ్రిటీలు ఎందుకు స్పందించలేదు. చిరంజీవిని మొదలుకొని పవన్ కళ్యాణ్ తో పాటు చాలామంది ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు స్పందించిన సెలబ్రిటీలు అప్పుడెందుకు స్పందించలేదు అంటూ నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్ కూడా సినీ సెలబ్రిటీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ వేసింది. ఇప్పుడున్న ఐక్యమత్యం.. పోసాని మాపై కామెంట్లు చేసినప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదంటూ ప్రశ్నిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పోసాని విషయంలో ఎందుకు స్టాండ్ తీసుకోలేదు..
గతంలో పవన్ కళ్యాణ్ మీద పోసాని ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయాడు. ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. పూనమ్ పేరు కూడా పరోక్షంగా తీశాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లు పెట్టి పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అప్పుడు తన గురించి ఎందుకు ఎవరు నిలబడలేదు అంటూ ప్రస్తుతం పూనమ్ ప్రశ్నిస్తోంది. సమంత విషయంలో ఇంతమంది ఏకత్రాటిపై నిలబడి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా అదే పవన్ విషయంలో నా పేరు కూడా బయటకు వచ్చింది అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు అంటూ పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
అయితే పూనమ్ పోస్ట్ పై నెటిజన్స్ కామెంట్లు..
ఇక పూనమ్ వేసిన ట్వీట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మీకు నిజంగా అన్యాయం జరిగితే, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి అన్యాయం చేస్తే వెళ్లి ఫిర్యాదు చేయండి. అంతేకాని ఇలా సోషల్ మీడియాలో పరోక్షంగా సెటైర్లు వేయడం ఎందుకు..? ఏం జరిగిందో అందరి ముందు చెప్పండి అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి పూనమ్ కౌర్ ఇంకెన్ని రోజులు ఈ విషయాలను బయటపెడుతుందో చూడాలి అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలు ఖండిస్తూ సమంతాకు అండగా నిలవడం ప్రశంసనీయమని చెప్పవచ్చు.
Why the industry did not stand up against #posanimuralikrishna comments ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 3, 2024