BigTV English

Mahesh Babu: ఇంత చీప్ గా ఎలా మాట్లాడతారు..కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మహేష్ బాబు

Mahesh Babu: ఇంత చీప్ గా ఎలా మాట్లాడతారు..కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మహేష్ బాబు

Mahesh Babu:  మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎంతటి  దుమారాన్ని రేపాయో అందరికి తెల్సిందే. కేటీఆర్ ను విమర్శించడానికి ఆమె ఇండస్ట్రీలో ఉన్న  హీరోయిన్స్ గురించి  అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబం గురించి ఆమె మాట్లాడిన మాటలు ఇండస్ట్రీని షేక్ చేశాయి.  నాగచైతన్య- సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని, N  కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తనవద్దకు పంపాలని నాగార్జునను  కేటీఆర్  డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇక దీనికి సమంత ఒప్పుకోలేక ఆమె  విడాకులు తీసుకొని బయటకు వచ్చిందని తెలిపారు.


ఇక సమంతతో పాటు చాలామంది హీరోయిన్స్ .. కేటీఆర్ కు భయపడే ఇండస్ట్రీనుంచి వెళ్లిపోయారని ఆరోపించారు.ఇక హీరోయిన్స్ గురించి ఒక మహిళా మంత్రి ఇలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటిగా మారి కొండా సురేఖపై విరుచుకు పడుతున్నారు. చిన్న హీరో దగ్గరనుంచి స్టార్ హీరోవరకు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ గోపాల్ వర్మ, రవితేజ, నాని, హీరోయిన్స్.. అందరు అక్కినేని కుటుంబానికి, సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.  రాజకీయ లబ్ది కోసం ఇండస్ట్రీని చిన్నచూపు చూడొద్దు అని అభ్యర్థిస్తున్నారు.

ఇక తాజాగా  సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం.. సమంతకు సపోర్ట్ గా నిలుస్తూ పోస్ట్ చేశాడు. “మంత్రి కొండా సురేఖ గారు.. మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా.. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను, ఆమె మాట్లాడిన భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బ తీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. ఆమె చేసిన చౌకబారు మరియు నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.


సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను మరియు మన సినీ సోదరులను చాలా మర్యాదగా.. గౌరవంగా చూడాలి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.  ఇక ఇప్పటికే  కొండా సురేఖ.. సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న విషయం తెల్సిందే. కానీ, ఈ వివాదాన్ని అంత సులువుగా వదిలేది లేదని ఇండస్ట్రీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ముందు ఈ వివాదం  ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×