Poonam Kaur:ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur)ఈ మధ్య తరచూ వివాదాలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram)లను టార్గెట్ చేస్తూ.. రోజుకొక పోస్ట్ షేర్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు నేరుగా డైరెక్టర్ త్రివిక్రమ్ పేరును మెన్షన్ చేస్తూ.. టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పూనమ్ కౌర్ ఇంతలా పోస్టులు పెడుతున్నా.. త్రివిక్రమ్ ఒక్క మాట కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
తెలుగు స్టార్ హీరో పై వేధింపుల ఆరోపణలు..
ఇదిలా ఉండగా తాజాగా.. మరో స్టార్ హీరో పై వేధింపుల ఆరోపణలు చేస్తూ. మరో పోస్ట్ షేర్ చేసింది పూనమ్ కౌర్. ఒక హీరోయిన్ ని ఒక స్టార్ హీరో వేధిస్తున్నారు అంటూ రాసుకు వచ్చింది. ఆమె తనతో పాటు ఒక ఫాంటసీ చిత్రంలో నటించినట్లు కూడా తెలిపింది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ తన పోస్టులో..”నేను తెలుగులో ఒక సోషియో ఫాంటసీ సినిమా చేశాను. ఆ సినిమాలో నాతో పాటు ఒక అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేయడం ఆపేసింది. ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా పోయింది. అయితే తాజాగా నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్లో కనిపించి,పెళ్లికి షాపింగ్ చేస్తున్నానని, తాను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు అంటూ రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే ఏమైందని నేను అడిగితే ఆమె సమాధానం ఇస్తూ..” ఒక సూపర్ స్టార్ డం కలిగిన హీరో నన్ను విపరీతంగా వేధిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫాలో చేస్తూ విసిగిస్తున్నాడు. ఒకప్పుడు మేము ఇంటిమేటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహం పై ఉమ్మి వేశాడు.అయినా సరే డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు.. ఇప్పుడు మళ్లీ కనిపించి నన్ను వేధిస్తున్నాడు” అంటూ అమ్మాయి చెప్పింది. ఇదంతా జరిగిన తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి , అమెరికాలో ఉన్నత చదువుకోడానికి వెళ్ళింది. కానీ ఇప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదని చెప్పింది. ఇప్పుడు నేను చెప్పేది కట్టు కథ కాదు.. నిజంగా ఆ అమ్మాయి కళ్ళల్లో పడిన బాధ నాకు అర్థం అయింది. ఆ తర్వాత నేను అమ్మాయిని హగ్ చేసుకుని మరీ ఓదార్చాను” అంటూ పూనమ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆ హీరో, హీరోయిన్ ఎవరు అంటూ నెటిజన్స్ సైతం ఆరాధిస్తున్నారు.
అటెన్షన్ క్రియేట్ చేయడం కోసమేనా..?
ఇక ఈ పోస్టులో ఆమె పైన తమిళనాడు అని మెన్షన్ చేసి, క్రింద మాత్రం తెలుగు సినిమాని మెన్షన్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలవని పూనమ్ అందరిలో అటెన్షన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి పోస్ట్ పెట్టిందా? లేక నిజంగానే జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.
!! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀
TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024